తెలంగాణ

ప్రజాభిప్రాయం బూటకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 14: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయసేకరణ, అభ్యంతరాలన్నీ బూటకమేనని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గత నెల 22న కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ముసాయిదా విడుదల చేస్తూనే ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఆయా జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్‌లో ఫిర్యాదు చేయాలని సిఎం చెప్పినప్పటికీ ఫిర్యాదులన్నీ బుట్టదాఖలైనట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఒకసారి నిర్ణయస్తే వెనక్కి తిరిగి చూడరని స్పష్టమవుతోంది. కొత్త జిల్లాలపై ఎన్ని అభ్యంతరాలు వచ్చినా కెసిఆర్ పరిగణలోకి తీసుకోవడం లేదని పలువురు నేతలు అంటున్నారు. హన్మకొండ జిల్లా ఏర్పాటు రద్దు చేసి జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని ఇప్పటికే 6 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చినా ప్రజాభిప్రాయాన్ని కనీసం పట్టించుకోవడం లేదు. చారిత్మక వరంగల్ నగరాన్ని రెండు ముక్కలు చేసి ఓరుగల్లు ప్రాధాన్యత తగ్గించవద్దని ఎన్ని ఫిర్యాదులు, అభ్యంతరాలు, మరెన్నో ఆందోళనలు జరిగినా స్పందనలేదు. చివరకు హన్మకొండ జిల్లా ఏర్పాటును సొంతపార్టీ ఎమ్మెల్యే వ్యతిరేకించిన ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం హన్మకొండ జిల్లా ఏర్పాటుకే మొగ్గుచూపుతున్నట్లు అధికార వర్గాల ద్వార తెలిసింది. హన్మకొండ జిల్లా ప్రతిపాదన రద్దుచేయాలని అఖిలపక్ష ఆందోళనతో ముఖ్యమంత్రి కెసిఆర్ తెరపైకి వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలు ఏర్పాటు అంటూ లీక్‌లు ఇచ్చి, ఉద్యమానికి బ్రేక్ వేసారు. హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనపై ప్రజల్లో ఎంత పెద్దఎత్తున వ్యతిరేకత ఉందో అంతకంటే రెట్టింపులో జనగామ జిల్లా ఏర్పాటును ప్రజలు కోరుకుంటున్నారు. అయితే కొత్త జిల్లా ఏర్పాటుపై ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవనే సంకేతాలు అధికారులకు సిఎం ఇచ్చారు. వరంగల్‌లో జిల్లాలో కొత్తగా మూడు మండలాలతో పాటు తొర్రూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేసేందుకు సిఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. జనగామ జిల్లా ఏర్పాటుపై సిఎం వ్యతిరేకతపై బలమైన కారణాలేంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. స్టేషన్‌ఘనపూర్, పాలకుర్తి నియోజకవర్గాలను జనగామలో కలిపి జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని ఆయా నియోజకవర్గాల ప్రజలు, అక్కడి ఎమ్మెల్యేలు కొత్త జిల్లాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ముందు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు.
అయిన్పప్పటికీ కెసిఆరే జనగామ జిల్లాకు అడ్డుపడుతున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ జనగామ జిల్లా సాధన సమితి మాత్రం పట్టువదలని విక్రమార్కునిలా ఈ నెల 16 నుండి ఆందోళన మరింత తీవ్రం చేయనుంది. 20న లక్ష మందితో జనగామలో జనగర్జన పేరుతో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయనున్నారు.
జీవో 123పై
హైకోర్టులో వాదనలు
శుక్రవారానికి వాయిదా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 14: రాష్ట్ర ప్రభుత్వం నేరుగా భూములు కొనుగోలు చేసే అధికారాలు రాజ్యాంగం కల్పించలేదని మల్లన్నసాగర్ ప్రాజెక్టు అంశంపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 123పై హైకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ, రాష్ట్రప్రభుత్వం విభజించూ పాలించు విధానాన్ని అమలు చేస్తోందని, భూముల విషయంలో రైతులపై వత్తిడి తెస్తోందని తెలిపారు. రాజ్యాంగంలోని 14వ అధికరణకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. మరి కొంతమంది తరఫున న్యాయవాదులు సత్యప్రసాద్, రవిచందర్ వాదనలు వినిపించారు. అనంతరం కేసు శుక్రవారానికి వాయిదా పడింది.

టిడిపి విభాగాలతో
రేవంత్ రెడ్డి భేటీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 14: తెలుగు దేశం అనుబంధ విభాగాలను మరింత పటిష్టం చేసేందుకు ఆ పార్టీ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి బుధవారం ఎన్టీఆర్ భవన్‌లో అనుబంధ విభాగాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో చర్చించారు. అనుబంధ విభాగాలను పటిష్టం చేసుకోవడంతో పాటు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ఉద్యమించేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందుకు ఇకమీదట ప్రతి మంగళవారం అనుబంధ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పార్టీ కార్యాలయం (ఎన్టీఆర్ భవన్)లో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, కార్యక్రమాల కమిటీ కన్వీనర్ జి. బుచ్చిలింగం, కార్యాలయ కార్యదర్శి అమర్‌నాథ్ బాబు, ప్రధాన కార్యదర్శి బొల్లం మల్లయ్యయాదవ్, తెలుగు యువత, మహిళా విభాగం నేతలు పాల్గొన్నారు.

‘ముద్ర యోజన’లో నేత కార్మికులు
బీమా ప్రయోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 14: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ముద్ర యోజన’ పథకంలో చేనేత కార్మికులందరినీ చేర్పించాలని పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ కోరారు. హాండ్లూమ్స్, టెక్స్‌టైల్స్ మఖ్యకార్యదర్శి డైరెక్టర్ డాక్టర్ ప్రీతిమీన, టెస్కో మేనేజింగ్ డైరెక్టర్ శైలజారామయ్యర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (తెలంగాణలో ముద్ర అమలుకు నోడల్ బ్యాంక్) డిప్యూటీ జనరల్ మేనేజర్ రాజీవ్ పురి తదితరులతో చర్చించారు. చేనేత కార్మికుల స్కిల్ డెవలప్‌మెంట్‌కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామన్నారు. చేనేత కార్మికులకు అవసరమైన రుణసదుపాయం కల్పిస్తామని రాజీవ్‌పురి తెలిపారు. ఈ విషయంలో తమ బ్యాంకు టెస్కోతో ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుతోందన్నారు. వ్యక్తిగతంగా కూడా చేనేత కార్మికులకు రుణసదుపాయం కల్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు. చేనేత కార్మికులకు బీమాసదుపాయం కల్పించేందుకు మహాత్మాగాంధీ బంకర్ బీమా యోజన పథకాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని అరవింద్‌కుమార్ కోరారు. ఎల్‌ఐసి అధికారులతో నిర్వహించిన మరో సమావేశంలో మాట్లాడుతూ, ఈ పథకం గురించి నేత కార్మికులను చైతన్యం చేయాలని సూచించారు.

వర్షాలతో కూలిన లేడీ డాక్టర్స్ భవనం
ప్రమాదం నుండి బయటపడిన కుటుంబ సభ్యులు
మెదక్, సెప్టెంబర్ 14: మెదక్ సిఎస్‌ఐ ఆస్పత్రి ప్రాంగణంలోని అతి పురాతన మిషనరీ లేడీ డాక్టర్స్ రెండంతస్థుల భవనం భారీ వర్షాలకు నాని కూలిపోయింది. ఇందులో నివసిస్తున్న రెండు కుటుంబాలు ప్రాణాపాయం నుండి తృటిలో బయటపడ్డాయి. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భారీ శబ్దం రావడంతో అందులో నివాసం ఉంటున్న ప్రసన్నకుమార్ అనే వ్యక్తి పెద్దగా కేకలు పెడుతూ నిద్రిస్తున్న భార్యపిల్లలు, అత్త, చెల్లెలను బయటకు పంపించడంతో ప్రమాదం నుండి బతికి బయటపడ్డారు. 116 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనం శిథిలావస్థకు చేరింది.