రాష్ట్రీయం

తిరుపతి నుంచి షిర్డీకి రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 25: తిరుపతి నుంచి షిర్డీకి రైలు కావాలనుకున్న సాయి భక్తుల కల నెరువేరుతోంది. ప్రతి మంగళవారం తిరుపతి నుంచి షిర్డీకి, ప్రతి బుధవారం షిర్డీ నుంచి తిరుపతికి నడిచే రైలును రైల్వే శాఖ మంత్రి ప్రభు ప్రారంభించనున్నట్టు రైల్వే శాఖ రీజనల్ ఆఫీసర్ సత్యనారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 26వ తేదీ సాయంత్రం 07417 నెంబరు గల రైలు సాయంత్రం 4.30 నిమిషాలకు తిరుపతిలో ప్రారంభిస్తారు. ఈ రైలు బుధవారం ఉదయం ఏడు గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అక్కడ నుంచి 7.15 నిమిషాలకు బయలుదేరి అదేరోజు రాత్రి 9.00 గంటలకు షిర్డీ చేరుకుంటుంది.
అలాగే 07415 నెంబరు గల రైలు 27వ తేదీ ఆదివారం రాత్రి 11 గంటలకు షిర్డీలో బయలుదేరి మరుసటి రోజు తిరుపతికి చేరుకుంటుంది. అటు తిరువాత జనవరి ఐదు నుంచి తిరుపతి నుండి షిర్డీకి, 6న షిర్డీ నుంచి తిరుపతికి నడుస్తాయి. 17 బోగీలున్న ఈ రైలులో ఓ ఎసి టు టైరు, ఒక ఎసి త్రీ టైరు, ఐదు స్లీపర్ కోచ్‌లు, ఆరు జనరల్ కోచ్‌లు ఉంటాయి. తిరుపతి నుండి షిర్డీకి బయలుదేరే రైలు రేణిగుంట, కోడూరు, రాజంపేట, నందలూరు, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, రాయ్‌చూర్, యాదగిరి, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, మల్కాజిగిరి, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, నాందేడ్, ఔరంగాబాద్, కోవర్‌గాన్ మీదుగా షిర్డీ చేరుకుంటుందని ఆయన తెలిపారు.