రాష్ట్రీయం

అమిత్ షావి అబద్ధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: రాష్ట్ర పన్ను వాటాగా రావాల్సిన మొత్తాన్ని తెలంగాణకు కేంద్రం దానమిచ్చినట్టు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతున్నారని నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఇచ్చింది పన్ను వాటాయే తప్ప, ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదన్నారు. 90 వేల కోట్లు తెలంగాణకు ఇచ్చినట్టు చెబుతున్న అమిత్ మాటల్లో నిజం లేదని, ఇప్పటి వరకు వివిధ పద్దుల కింద కేంద్రం నుంచి అందించి 47 వేల కోట్లు మాత్రమేనన్నారు. తెలంగాణ ప్రజలు కేంద్రానికి పన్నులు చెల్లిస్తున్నారు, తిరిగి పొందడం తెలంగాణ హక్కు అన్నారు. ఆంధ్రకు ప్రత్యేక సాయం ప్రకటనలతో హడావుడి చేస్తున్న కేంద్రం, తెలంగాణకు ఏం ప్యాకేజీ ఇవ్వనున్నారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఖర్చును భరిస్తున్న కేంద్రం, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు ఖర్చు పెట్టదో అమిత్ షా ప్రకటించాలన్నారు. ఏపీకి రైల్వే జోన్ ఇస్తామంటున్న కేంద్రం, కాజీపేటకు
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. వౌలిక సదుపాయాలు కల్పిస్తాం, మామునూరు ఎయిర్ పోర్ట్ అభివృద్ధి చేయండంటే కేంద్రం స్పందించడం లేదన్నారు. ఐటిఐఆర్ ప్రాజెక్టు ఏమైందో కేంద్రం ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రాత్రికి రాత్రి ఆరు మండలాలను ఏపీలో కలిపి తెలంగాణకు అన్యాయం చేసిన చరిత్ర బిజేపిదని మండిపడ్డారు. ఆరు మండలాలతోపాటు లోయర్ సీలేరు, ఇందిరాసాగర్ ప్రాజెక్టును ఆంధ్రలో కలిపేశారన్నారు. గిరిజనులను నిరాశ్రయులను చేసి పోలవరం ప్రాజెక్టు కడుతున్నారని విమర్శించారు. తెలంగాణకు బిజెపి ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదని, నష్టం చేకూర్చారన్నారు. నిజానికి కేంద్ర రాష్ట్రానికి ఇచ్చిన నిధులకంటే, రాష్ట్రం నుంచి కేంద్రానికి కట్టిన పన్నుల మొత్తమే ఎక్కువన్నారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని అడిగి తెలుసుకోవాలని అమిత్‌షాకు సూచించారు. అనేక సంక్షేమ పథకాలకు కేంద్రం కోత విధించిందని, బడ్జెట్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖలో 50శాతం కోత విధించారన్నారు. బిజెపి అధికారంలోకి రాగానే మోడల్ స్కూళ్లు మూసేస్తే, తెరాస ప్రభుత్వం టీచర్లకు జీతాలిచ్చి పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తోందన్నారు. వరంగల్ స్మార్ట్ సిటీకి కేంద్రం వంద కోట్లిస్తే, తెలంగాణ ప్రభుత్వం మూడు వందల కోట్లు ఇచ్చిందన్నారు.
తెలంగాణ మత సామరస్యానికి మారుపేరని, తెలంగాణ చరిత్ర తెలుసుకొని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడితే మంచిదన్నారు. భయంతోనే కెసిఆర్ విమోచన దినం జరపడం లేదని అమిత్ షా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కెసిఆర్ మొండి ఘటం. ఎవరికీ భయపడే రకం కాదు. 14 ఏళ్ళపాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన విషయాన్ని గుర్తెరగాలన్నారు. ఉమ్మడి ఆంధ్రలో తెదేపా-్భజపా కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని, ఎన్నిసార్లు సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం నిర్వహించాయని హరీశ్ ప్రశ్నించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో సిఎం సహా మొత్తం ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయించి అస్థిరపర్చిన బిజెపి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలను అస్థిరపర్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బిజెపి నేతలు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటమా? అని ప్రశ్నించారు. సిఎంలను దించి సుప్రీం కోర్టుతో మొట్టికాయలు వేయించుకున్న వారు ఈ మాటలు మాట్లాడటం తగదన్నారు. పురంధ్రీశ్వరి, కావూరి సాంబశివరావులు మంత్రులుగా ఉన్నప్పుడే కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరారని, వారికి ఎన్ని కోట్లిచ్చి కొన్నారో చెప్పాలని హరీశ్ ప్రశ్నించారు.