రాష్ట్రీయం

ప్రాజెక్టుల్లోకి భారీవరద!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ, మహారాష్టల్రలో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా కృష్ణానదిపై ఉన్న జూరాల, శ్రీశైలం, గోదావరి నదిపై ఉన్న శ్రీరాం సాగర్, మంజీరాపై ఉన్న సింగూర్ ప్రాజెక్టుల్లోకి భారీ వరద వస్తోంది. కృష్ణాపై ఉన్న జూరాలలోకి పరీవాహక ప్రాంతం నుండి 48015 క్యూసెక్కుల వరద చేరుతుండటంతో, ప్రాజెక్టు రక్షణను దృష్టిలో ఉంచుకుని 50631 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. జూరాల నెల రోజుల క్రితమే పూర్తిగా నిండిపోవడంతో అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులోకి వస్తున్న వరదనీటిని యథాతథంగా దిగువకు వదిలివేస్తుండటంతో ఈ వరద శ్రీశైలంలోకి చేరుతోంది. జూరాల-శ్రీశైలం మధ్య ఉన్న పరీవాహక ప్రాంతంలో కూడా భారీ వర్షాలు ఉండటంతో 92693 క్యూసెక్కుల వరద శ్రీశైలంలోకి చేరుతోంది. శ్రీశైలంలోకి వస్తున్న వరదను యథాతథంగా ప్రాజెక్టులో నిలువ చేస్తున్నారు. 215 టిఎంసిల నిలువనీటి సామర్థ్యం ఉన్న శ్రీశైలంలో ప్రస్తుతం 156 టిఎంసిల నీరు ఉంది. అయితే శ్రీశైలం నుండి నీటిని విడుదల చేయకపోవడంతో నాగార్జునసాగర్‌లోకి నీరు చేరడం లేదు. గత రెండు రోజుల నుండి పులిచింతలలోకి వస్తున్న భారీ వరద తగ్గుముఖం పట్టింది. ఆదివారం కేవలం 6610 క్యూసెక్కుల నీరుమాత్రమే చేరుతోంది. పులిచింతల నుండి వదిలివేస్తున్న 4వేల క్యూసెక్కుల నీటితో పాటు దిగువన ఉన్న పరీవాహకప్రాంతం నుండి వస్తున్న వరద కలిపి ప్రకాశం బ్యారేజీలోకి 14,494 క్యూసెక్కుల నీరు చేరుతోంది. దాంతో ప్రకాశం బ్యారేజ్ ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా, గుంటూరు చానెళ్లకు 14494 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఇలా ఉండగా మహారాష్టల్రో కురుస్తున్న వర్షాల మూలంగా గోదావరి ద్వారా శ్రీరాంసాగర్‌లోకి 82066 క్యూసెక్కుల వరద చేరుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాల మూలంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కూడా 5600 క్యూసెక్కుల వరద వస్తోంది. మహారాష్టల్రో వర్షాల కారణంగా మంజీరాపై ఉన్న సింగూర్ ప్రాజెక్టులోకి 42418 క్యూసెక్కుల భారీ వరద వస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 15.09 టిఎంసిల నీరు చేరింది. కాగా, ధవళేశ్వరంలోకి గోదావరి ద్వారా 397032 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ధవళేశ్వరం నుండి ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా, సెంట్రల్‌డెల్టాలకు కలిపి 10300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిగతా 3.86 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలివేస్తున్నారు.
కొనసాగనున్న వర్షాలు
ఈ నెల 21, 22 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది కోస్తా తీర జిల్లాలతో పాటు, తెలంగాణలోని 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. దాంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఎలాంటి ఇక్కట్లు రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.