రాష్ట్రీయం

రేపు ఢిల్లీకి రండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం ఈనెల 21న ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ఆహ్వానించింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించే అంశాలతో కూడిన అజెండాను ఇరు రాష్ట్రాలకు పంపించారు. కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా ఒక్కో రాష్ట్రం నుంచి ఐదుగురు ప్రతినిధులను సమావేశానికి ఆహ్వానించారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీటిపారుదల శాఖ మంత్రులతోపాటు, ఇరువురు ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ అధికారులు హాజరవుతారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తోందని ఏపికి చెందిన ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావుసహా మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించడంతో ఈనెల 21న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తొలి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు అజెండాలో కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
సుప్రీంకోర్టు చేసిన సూచన మేరకు పిటిషన్‌లోప్రస్తావించిన ప్రాజెక్టులపై సమావేశంలో చర్చిస్తారు. ఔట్ ఫ్లో, ఇన్‌ఫ్లోకు సంబంధించి వివిధ రిజర్వాయర్లు, వివిధ ప్రాంతాల్లో వాస్తవ లెక్కలు చూసే విధానం ఏర్పాటు చేస్తారు. కృష్ణా, గోదావరి నదుల్లో రెండు రాష్ట్రాల పంపకాలపై ఉన్న వివాదాలను చర్చిస్తారు.
పాలమూరు- రంగారెడ్డి, డిండి నిబంధనలకు విరుద్ధంగా కొత్తగా కడుతున్న ప్రాజెక్టులు అని ఆంధ్ర ప్రభుత్వం వాదిస్తుండగా, ఇవి ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినవేనన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన. కాగాఇక గోదావరి జలాలను కృష్ణా పరివాహక ప్రాంతంలోకి ఆంధ్రప్రదేశ్ తరలిస్తుండడంతో ఇందులో తమకు వాటా ఉంటుందని తెలంగాణ వాదిస్తోంది. విభజన తరువాత జల వివాదాలపై ఇరు రాష్ట్రాలతో కేంద్రం సమావేశం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి.