ఆంధ్రప్రదేశ్‌

జంబ్లింగ్ పద్ధతి రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఈ నెల 21 నుండి సమ్మేటివ్ పరీక్షలు పాత పద్ధతిలోనే జరుపుతామని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాధ్ స్పష్టం చేవారు. బోధించిన ఉపాధ్యాయులే పిల్లల్ని మూల్యాంకనం చేయాలని వాల్యూయేషన్‌లో జంబ్లింగ్ పద్ధతి సరికాదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ కార్యదర్శి హామీపై సమాఖ్య చైర్మన్ పి బాబురెడ్డి, సెక్రటరీ జనరల్ జి హృదయరాజు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల పనిదినాలకు ఆటంకం కలిగిస్తూ, సిసిఇ విధానానికి విరుద్ధమైన జంబ్లింగ్ పద్ధతిలో వాల్యూయేషన్ చేయడం సరికాదని ఫ్యాప్టో నేతలు కోరడంతో ముఖ్యకార్యదర్శి ఈ నిర్ణయం తీసుకున్నారు. 9వ తరగతిలో ఎస్‌ఎ-3కి మాత్రమే జంబ్లింగ్ పరిమితం చేస్తూ ఉత్తర్వులు ఇస్తున్నట్టు ముఖ్యకార్యదర్శి చెప్పారని బాబురెడ్డి పేర్కొన్నారు.