రాష్ట్రీయం

దోమలపై దండయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 20:ఆంధ్రప్రదేశ్‌ను దోమలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఉద్యమ స్ఫూర్తితో కదలి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆధ్వర్యంలో దోమలపై దండయాత్ర ప్రత్యేక పుస్తకాన్ని, ఎన్‌టిఆర్ శిశు సంరక్షణ కిట్‌ను, మహిళా మాస్టర్ హెల్త్‌కార్డును ఆవిష్కరించారు. ఈ పథకాలకింద 35 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ చెకప్‌లు చేస్తారు. బాలింతలకు బేబీ కిట్స్ పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దోమలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దగలిగితే అనారోగ్యాల బారి నుండి మనల్ని మనం రక్షించుకోగలుగుతామని అందుకు తగిన విధంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకున్నామన్నారు. ఈనెల 24న ఒక ఉద్యమంలా కోటిమంది విద్యార్థులు, మహిళలు, ప్రజల సమక్షంలో క్షేత్రస్థాయిలో దోమల నిర్మూలనపై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకువస్తున్నామన్నారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు, కలుషితమైన నీరు, ఆహారం, గాలి ద్వారా సంక్రమించే వ్యాధులపై ప్రజలను చైతన్య పరిచేందుకు పుస్తకాన్ని సమగ్రంగా
అవగాహన కలిగించే విధానంలో రూపొందించామన్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులు, మహిళలు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు భాగస్వాములు అయ్యేలాగ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఏ వ్యాధి ఎలా వ్యాపిస్తుందో 9 అంశాలపై పుస్తకాన్ని రూపొందించామని ఇది ప్రతి విద్యార్థికి అందేలా పాఠశాలలకు, కళాశాలలకు ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు పంపిణీ చేస్తామని వివరించారు. ఇప్పటికే శ్రీలంక దేశం దోమలు లేని దేశంగా పేరొందిందని, అదే తరహాలో మనం కూడా చర్యలు తీసుకుంటే పర్యాటకులను మరింతగా ఆకర్షించగలుగుతామని చెప్పారు.
ప్రతి శనివారం మధ్యాహ్నం పూర్తిగా పరిసరాల పరిశుభ్రతపై అధికారులు, ప్రజలు, విద్యార్థులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రతి 4వ శనివారం పూర్తిస్థాయిలో కార్యక్రమాలను నిర్వహించుకోవాలని ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంటి పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించి వారిలో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి ఆలోచనలకు ప్రతి రూపంగా ఎన్‌టిఆర్ శిశు సంరక్షణ కిట్ ఆవిష్కరణను చేస్తున్నామని మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈరోజు నుండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన ప్రతి మహిళకు ఇంటికి వెళ్లే సమయంలో శిశు సంరక్షణ కిట్‌ను అందిస్తామన్నారు. దోమల పెరుగుదల నియంత్రణ 35 సంవత్సరాలు నిండిన మహిళా ఆరోగ్య సంరక్షణ, మహిళా మాస్టర్ హెల్త్ చెకప్ ద్వారా ఆరోగ్య పరీక్షల విధానానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. ఆసుపత్రుల్లో పుట్టిన బిడ్డ ఇంటికి వెళ్లే సమయంలో దోమతెర, హ్యాండ్ వాష్ స్కబ్, టవలు, బేబీ పౌచ్ అందిస్తున్నామన్నారు.
వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ దోమల నివారణపై సమన్వయంతో అందరం కలిసి ముందుకు వెళ్లాలని ఇందుకు ముఖ్యమంత్రి దిశ నిర్ధేశంతో ఒక బృహత్తరమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం జరిగిందన్నారు.

చిత్రం.. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు