రాష్ట్రీయం

పిడి వాదనలు చేయవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: తెలంగాణ ప్రభుత్వం నీటి కేటాయింపుల విషయంలో మొండిగా పోతోందని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పులలోనూ, విభజన చట్టం 2014లోనూ కేటాయింపుల గురించి, ప్రాజెక్టుల గురించి స్పష్టంగా పేర్కొన్నా ఆ నిబంధనలను తెలంగాణ ఉల్లంఘిస్తోందని చెప్పారు. బచావత్ ట్రిబ్యునల్ ఎపికి 512 టిఎంసిలు, తెలంగాణకు 299 టిఎంసిలు కేటాయించారని, విభజన చట్టంలోని షెడ్యూలు 11 ప్రకారం ఎపికి మిగులు జలాలపై పూర్తి హక్కు ఉందని , ఉమ్మడి ఎపిలో 15 సంవత్సరాల నీటిని పరిశీలిస్తే ఐదేళ్లు మాత్రమే 811 టిఎంసిలు వచ్చిందని, గత ఏడాది 73 టిఎంసిలు మాత్రమే వచ్చాయని, ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం 150 టిఎంసిలు నీటిని అదనంగా వాడుకుంటామని అంటున్నారని తాగడానికి కూడా ఎపికి నీరు లేకుండా చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. విభజన చట్టంలో పెండింగ్ ప్రాజెక్టులు ఆరు ఉన్నాయని , కల్వకుర్తికి జూరాల నుండి నీటిని తీసుకోమన్నారే కానీ కృష్ణా నది నుండి కాదని గుర్తించాలని అన్నారు. పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు 120 టిఎంసిల నీరు కేటాయించాలని అంటున్నారని కొత్త ప్రాజెక్టులు నిర్మించాలంటే కృష్ణా వాటర్ బోర్డు , అపెక్స్ కౌన్సిల్, సిడబ్ల్యుసి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో సింగూరు, శ్రీరాంసాగర్, జూరాల ప్రాజెక్టులను కట్టడం వల్ల మహారాష్టల్రో ముంపు అవుతున్నందున 35 టిఎంసిలు మహారాష్టక్రు ఇస్తామన్నామని చెప్పారు. పోలవరంలోని 45 టిఎంసిలలో ఒక్క చుక్క కూడా తెలంగాణకు హక్కు లేదని గాలి ముద్దుకృష్ణమనాయుడు పేర్కొన్నారు. డిండి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.