తెలంగాణ

హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్దమా అని టిటిడిపి రైతు విభాగం అధ్యక్షుడు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి మంత్రి కె.తారకరామారావు (కెటిఆర్)కు సవాల్ విసిరారు. విదేశాల్లో కెటిఆర్ పర్యటించి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు తప్ప తెలుగుదేశం హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందనే విషయాన్ని ఎందుకు వెల్లడించడం లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఎన్టీఆర్ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలనే ఆలోచనే తప్ప, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసే ఉద్దేశ్యం టిఆర్‌ఎస్‌కు లేదని అన్నారు. 18 నెలల టిఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్‌కు వనె్న తెచ్చే విధంగా సిఎం కెసిఆర్ ఏ కార్యక్రమం చేశారో చెప్పాలని ఒంటేరు డిమాండ్ చేశారు.