ఆంధ్రప్రదేశ్‌

ముంచెత్తుతున్న వాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 21: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలోనూ పెద్ద ఎత్తున వర్షాలు ముంచెత్తాయి. ఒక్క కడప జిల్లాలోనే గత 24 గంటల్లో దాదాపు 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం రాత్రి మరింత తీవ్రంగా వర్షాలు కురుస్తున్నాయి. కడప నగరంతో పాటు, పలు ప్రాంతాల్లో ఏరులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతంలోకి భారీగా వర్షపునీరు వచ్చి చేరింది. రుతుపవనాల ప్రభావంతో కడప జిల్లా అంత టా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురిశాయి. జిల్లాలోని రాజుపాలెం, పెద్ద ముడియం, చాపాడు, కమలాపురం, వల్లూరు, ఖాజీపేట, చెన్నూరు, కడప, సిద్దవటం, జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా చెన్నూరులో 112.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా అత్యల్పంగా గోపవరంలో 1.6 మిమీ కురిసింది. కడప నగరంలో 70 మిమీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు జిల్లాలోని కుందూ, పెన్నానదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షానికి కడప నగరం తడిసి ముద్దయింది. రాజుపాళెం మండలంలోని మడవంక ఉద్ధృతంగా ప్రవహించడంతో కాజ్‌పై మూడు అడుగుల మేర నీరు ప్రవహించింది. అదే సమయంలో ఆళ్లగడ్డ నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కాజ్‌వేపై నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కడప నగరంలోని లోతట్టు ప్రాంతాలైన చిన్నచౌకు, సుబ్బిరెడ్డికాలనీ, ఆర్టీసీ బస్టాండు తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు ఉభయగోదావరి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఏజెన్సీలోని కొండవాగులు భారీగా ప్రవహిస్తున్నాయి. కాకినాడ- ఉప్పాడ తీరంలో మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరిక జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కోస్తా అంతటా బుధవారం రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా చలి గాలులు వీస్తున్నాయి.