రాష్ట్రీయం

మూడు నెలల్లో నిర్ణయం చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: తెరాసలో చేరిన 12మంది తెలంగాణ తెదేపా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై వచ్చే మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ మదుసూధనాచారిని హైకోర్టు బుధవారం ఆదేశించింది. తెలంగాణ శాసనసభలో తెదేపా శాసనసభాపక్షం తెరాస శాసనసభాపక్షంలో విలీనమైనట్లుగా శాసనభ ఈ ఏడాది మార్చి 10న ఇచ్చిన బులెటిన్‌ను సవాలు చేస్తూ తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి ఎంఎస్ రామచంద్రరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పదవ షెడ్యూల్ ప్రకారం స్పీకర్ ట్రిబ్యునల్‌కు చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తారని, ఎమ్మెల్యేల అనర్హత అంశంపై మాత్రమే నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుందని, రాజ్యాంగం ప్రకారం ఒక రాజకీయ పార్టీ మరో పార్టీలో విలీనమైనట్లు నిర్ణయం తీసుకునే హక్కు లేదని పిటిషనర్ పేర్కొన్నారు. తెదేపా ఎమ్మెల్యేలు ఇ దయాకరరావు, తలసాని శ్రీనివాస యాదవ్, జి సాయన్న, టి ప్రకాశ్ గౌడ్, తీగల కృష్ణా రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కెపి వివేకానంద, చల్లా ధర్మారెడ్డి, ఎస్ రాజేంద్రరెడ్డి, మాగంటి గోపినాథ్, అరికెపూడి గాంధీలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లు ఏడాదిగా స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
హైకోర్టు ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తూ పంజాబ్, హర్యానా కోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరించింది. కులదీప్ బిష్నోయ్ కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు, రాజేంద్ర సింగ్ రాణా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పదవ షెడ్యూల్‌లోని ఆరవ పేరా ప్రకారం ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఉండే స్పీకర్ తీసుకునే నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేయవచ్చని హైకోర్టు పేర్కొంది. స్పీకర్ తెరాసలోకి మారిన 12మంది తెదేపా ఎమ్మెల్యేలను తెరాస సభ్యులు కూర్చునే స్థానాల్లో కూర్చోవచ్చని నిర్ణయం తీసుకున్నారని కోర్టు పేర్కొంది. ఈ రోజు నుంచి వచ్చే మూడు నెలల్లోగా స్పీకర్ తన వద్ద పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నట్లు హైకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా మూడు అంశాలను హైకోర్టు జడ్జి ప్రస్తావించారు. పదవ షెడ్యూల్ కింద స్పీకర్ తీసుకున్న నిర్ణయం శాసనసభ నిర్ణయంకాదని, శాసనసభ ఆమోదం పొందాల్సిన అంశం కాదని, శాసనసభ స్వయంప్రతిపత్తితో పని చేసేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. రాజ్యాంగంలోని 212 అధికరణ కింద ఈ అంశంపై న్యాయపరమైన సమీక్ష చేయకూడదనే నిబంధన ఏమీ లేదని కిహోటో హొల్లోహాన్ కేసులో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును హైకోర్టు జడ్జి ప్రస్తావించారు. ఈ సందర్భంగా హైకోర్టు అడ్వకేట్ జనరల్ ప్రస్తావించిన అంశాలతో ఏకీభవించేందుకు హైకోర్టు నిరాకరించింది.