రాష్ట్రీయం

మెడికల్ కౌనె్సలింగ్‌లో హతాశులైన అభ్యర్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: తెలంగాణ మెడికల్ కౌనె్సలింగ్‌లో తప్పనిసరి సీట్లు దక్కుతాయని భావించిన విద్యార్ధులకు ఆశాభంగమే ఎదురైంది. మంచి ర్యాంకులు సాధించినా తక్కువ సంఖ్యలో కన్వీనర్ కోటా సీట్లు ఉండటంతో విద్యార్ధులకు సీట్లు దక్కలేదు. దాంతో విద్యార్ధులు హతాశులయ్యారు. రిజర్వుడ్ కేటగిరిల్లో కూడా అభ్యర్ధులకు సీట్లు దక్కలేదు. ఈసారి తెలంగాణ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించి కన్వీనర్ కోటా సీట్ల అలాట్‌మెంట్ ప్రక్రియను కాళోజీ నారాయణ రావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైనె్సస్ పర్యవేక్షించింది. పకడ్బందీగా యూనివర్శిటీ అన్ని చర్యలూ తీసుకుని తల్లిదండ్రుల మన్ననలు పొందింది. అడ్మిషన్ల తొలి జాబితాను ఉస్మానియా యూనివర్శిటీలో వైద్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారి , హెల్త్ యూనివర్శిటీ విసి డాక్టర్ కరుణాకర్‌రెడ్డి విడుదల చేశారు. కాలేజీల వారీ సీట్ల జాబితాలు వెబ్‌సైట్‌లో ఉంచినట్టు వారు చెప్పారు. తొలి జాబితాలో చేరిన వారిలో తొలి సీటు రేగెళ్ల ప్రఫుల్ల మానసకు ఉస్మానియా మెడికల్ కాలేజీ రాగా, పి శ్రీహారికకు గాంధీలోనూ, తప్పెట తేజస్వినికి ఉస్మానియా, జీషన్ అహ్మద్ జలీలుకు ఉస్మానియా, ఇక్రమ్ ఖాన్‌కు ఉస్మానియా, ఎ శ్రీకంటేశ్వరరెడ్డికి గాంధీ, ఎం అలేఖ్యకు ఉస్మానియా, నుజాత్ ఫాతిమాకు ఉస్మానియా, బలుసు కావ్య, వేంపటిరూపేష్‌కు గాంధీలో సీట్లు కేటాయించారు. కాగా ఈ నెల 26 నుండి క్లాసులు మొదలవుతాయని, ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల లోగా సీట్లు పొందిన వారు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని అధికారులు పేర్కొన్నారు.
ఎమ్సెట్ -3లో 36వేల మంది వరకూ క్వాలిఫై అయినా, మొత్తం 12112 మంది సర్ట్ఫికెట్ల పరిశీలనకు హాజరుకాగా వారిలో 11866 మంది మాత్రమే తమ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకున్నారు. ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1100 సీట్లు, 14 ప్రైవేటు కాలేజీల్లో 2050 సీట్లు ఉన్నాయి. అలాగే ఒక ప్రభుత్వ డెంటల్ కాలేజీలో వంద సీట్లు, 11 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1140 సీట్లు ఉన్నాయి. అయితే కన్వీనర్ కోటాలో మెడికల్, డెంటల్ కలిపి కేవలం 2100 సీట్లను మాత్రమే భర్తీ చేశారు. కాగా మిగిలిన సీట్లలో బి కేటగిరి కింద ఉన్న కోటాను నీట్ ర్యాంకు ఆధారంగానూ, సి కేటగిరి సీట్లను నీట్ ఆధారంగానే యాజమాన్యం ఎన్‌ఆర్‌ఐ కోటాగా భర్తీ చేయనుంది. ఇందుకోసం ప్రైవేటు కాలేజీల సంఘం ఒయు దూరవిద్యా కేంద్రంలో ఈ నెల 23, 24 తేదీల్లో కౌనె్సలింగ్ నిర్వహించనుంది. సీటు దక్కిన విద్యార్ధులు మొదటి ఏడాది ఫీజుతో పాటు వచ్చే ఏడాది ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
మారేడ్‌పల్లి పాలిటెక్నిక్ కాలేజీలో బుధవారం అర్ధరాత్రి వరకూ మెడికల్ కౌనె్సలింగ్‌లో భాగంగా సర్ట్ఫికేట్ల పరిశీలన కార్యక్రమం జరిగింది. ఉదయం ఆరు గంటల నుండే వందలాది విద్యార్ధులు వెరిఫికేషన్ సెంటర్‌కు వచ్చారు. భారీ వర్షంలో అర్ధరాత్రి వరకూ వేచి ఉన్నా వారికి చివరి నిమిషంలో క్వాలిఫై కాలేదని చెప్పడంతో విద్యార్ధులు నిర్ఘాంత పోయారు. తమకు ర్యాంకు కార్డు, వెరిఫికేషన్‌కు రమ్మని మెసేజ్ వచ్చిందని అధికారులకు వాటిని చూపించి విద్యార్ధులు, తల్లిదండ్రులు వాదనకు దిగారు. ఉదయం తమ వద్ద నుండి రెండు వేల రూపాయిలు కౌనె్సలింగ్ ఫీజు కూడా కట్టించుకున్నారని సర్ట్ఫికేట్లు పరిశీలించకుండానే వేచి ఉండమని చెప్పారని వారు పేర్కొన్నారు. చివరికి అర్ధరాత్రి క్వాలిఫై మార్కులు రాలేదని , పరిశీలనకు అనుమతించలేదని వారు పేర్కొన్నారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని నచ్చచెప్పారు. పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ నోటిఫికేషన్ ప్రకారం ఇంటర్‌లో ఒసిలకు 50 శాతం మార్కులు, బిసిలకు 40 శాతం మార్కులు వస్తేనే అర్హత సాధించనట్టని తల్లిదండ్రులకు వివరించారు. దాంతో తమ డబ్బులు తమకు ఇవ్వాలని వారు కోరడంతో ప్రిన్సిపాల్ వారు చెల్లించిన రెండు వేల రూపాయిలు చొప్పున ఫీజును వెనక్కు ఇచ్చారు.