రాష్ట్రీయం

పెద్దలకే క్రీమీ లేయర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: బిసి రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు, ఆందోళన చేయాలని బిసి సంఘాలు ప్రయత్నిస్తుండగా, ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే క్రీమీ లేయర్‌ను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జాతీయ బిసి కమీషన్ జస్టిస్ వి ఈశ్వరయ్య ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించారు. క్రీమీ లేయర్ ఎవరికి వర్తిస్తుందో వివరిస్తూ కమిటీ నివేదికలోని అంశాలను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం చాలా కొద్ది మంది మాత్రమే క్రీమీ లేయర్ పరిధిలోకి వస్తారు. రాష్టప్రతి, ఉప రాష్టప్రతి పిల్లలు, గవర్నర్లు, లెప్ట్‌నెంట్ గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ చైర్‌పర్సన్స్, సభ్యుల పిల్లలు క్రీమీ లేయర్ పరిధిలోకి వస్తారు. వీరికి రిజర్వేషన్లు వర్తించవు. వీరితోపాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్, సభ్యులు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్స్, చీఫ్ ఎలక్షన్ కమీషన్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, వివిధ రాష్ట్రాల అడ్వకేట్ జనరల్స్, కేంద్ర రాష్ట్ర మంత్రులు, సిట్టింగ్ ఎంపిల పిల్లలు క్రీమీ లేయర్ పరిధిలోకి వస్తారు. వీరి పిల్లలకు బిసి రిజర్వేషన్లు వర్తించవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో గ్రూప్ ఎ, క్లాస్ వన్ ఆఫీసర్స్ (డైరెక్ట్ రిక్రూటీ) భార్యా భర్తలు ఇద్దరూ గ్రూప్ బి క్లాస్ 2 ఆఫీసర్స్ అయితే వారి పిల్లలు క్రీమీ లేయర్ పరిధిలోకి వస్తారు. పబ్లిక్ అండర్ టేకింగ్ సెక్టార్‌లో భార్యాభర్తల్లో ఒకరు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉంటే వారి పిల్లలు, యూనివర్సిటీలు, ప్రైవేటు రంగంలో ఏటా పదిహేను లక్షల వరకు ఆదాయం ఉన్న వారి పిల్లలు క్రిమిలేయర్‌గా జాతీయ బిసి కమీషన్ నివేదిక పేర్కొంది. అయితే ఇలాంటి కేటగిరిల్లో ఉన్న వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంటుందని వీరిని క్రీమీ లేయర్ పరిధిలోకి తీసుకురావడంవల్ల బిసిల్లోని ఇతరులకు ప్రయోజనం అని ప్రభుత్వం చెబుతోంది.
జాతీయ బిసి కమీషన్ సైతం ఇదే వాదన వినిపిస్తోంది. ఈనిర్ణయం వల్ల బిసి పేదలకు ప్రయోజనం కలుగుతుందని బిసి జాతీయ కమీషన్ చైర్మన్ జస్టిస్ వి ఈశ్వరయ్య వెల్లడించారు.