రాష్ట్రీయం

దంచికొట్టొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో శనివారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. గురువారం ఏర్పడిన అల్పపీడనం ఉత్తరకోస్తాంధ్ర, తెలంగాణ, దక్షిణ చత్తీస్‌గఢ్ మధ్యభాగంలో ప్రభావం చూపగా, ప్రస్తుతం ఇది తెలంగాణ, దక్షిణ చత్తీస్‌గఢ్, విదర్భ మధ్య కొనసాగుతోంది. ఇలాఉండగా నైరుతీ రుతుపవనాలు తెలంగాణ జిల్లాల్లో ఉద్ధృతంగానూ, ఆంధ్రలో చరుగ్గానూ ఉన్నాయి. అల్పపీడనంతో పాటు నైరుతీ రుతుపవనాల ప్రభావం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందని ఐఎండి స్పష్టం చేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో శనివారం భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉంటాయని ఐఎండి శాస్తవ్రేత్త డాక్టర్ రంజీత్ సింగ్ పేర్కొన్నారు. ఆది, సోమ, మంగళవారాల్లోనూ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
గత 24 గంటల్లో వరంగల్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. వరంగల్ జిల్లా ధర్మసాగర్‌లో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లా కంపసాగర్‌లో 17, నిజామాబాద్ జిల్లా లింగంపేట, తాడ్వాయిలలో 15 సెంటీమీటర్లు, వరంగల్ జిల్లా ఘన్‌పూర్, నిజామాబాద్ జిల్లా పిట్లంలలో 14, నల్లగొండ, మెదక్ జిల్లా సదాశివనగర్, నిజామాబాద్ జిల్లా జుక్కల్, గాంధారి, మిర్యాలగూడ, వరంగల్ జిల్లా ఖానాపూర్, ఖమ్మం జిల్లా కొత్తగూడెంలలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. ఆంధ్ర, కర్నాటకలోనూ చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తమిళనాడులో పెద్దగా వర్షాలు నమోదు కాలేదు.

చిత్రం.. ప్రమాదస్థాయకి చేరిన హుస్సేన్ సాగర్ నుంచి దిగువకు భారీగా వదిలేస్తున్న వరదనీరు.