తెలంగాణ

అసెంబ్లీ భేటీకి సర్కారును ఆదేశించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: రాష్ట్రంలో తీవ్ర అనావృష్టి పరిస్థితులు నెలకొన్నందున వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి చర్చించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని టి.టిడిపి శాసనసభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరారు. సాగు నీరు లేక పంటలు ఎండిపోయాయని, తాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు రుణ మాఫీ జరగక, బ్యాంకు అప్పులు, ప్రైవేటు అప్పుల భారంతో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఆయా కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉందని ఎర్రబెల్లి శుక్రవారం గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరవు మండలాలను ప్రకటించడంలో ఎనలేని జాప్యం చేసిందని, ఫలితంగా కేంద్ర బృందా లు రావడంలో ఆలస్యం జరిగిందని, దీంతో కేంద్ర సాయం అందకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రుణాలను రీ-షెడ్యూలు చేయనందున రైతులు బీమా సౌకర్యాన్ని పొందలేకపోయారని ఆయన తెలిపారు. ప్రజలకు సంబంధించిన అనేకానేక సమస్యలపై చర్చించి పరిష్కారం చూపాల్సిన అసెంబ్లీ ఉనికి కోల్పోతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నామమాత్రపు సమావేశాలు జరుపుతూ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సచివాలయానికి రానందువల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.
ఈ ఏడాది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 14 రోజులు, వర్షాకాల సమావేశాలు 7 రోజులు మొత్తం 21 రోజులు మాత్రమే జరిగాయని ఆయన తెలిపారు. గతంలో 2004 సంవత్సరంలో 43 రోజులు, 2005లో 52 రోజులు, 2006లో 52 రోజులు, 2007లో 51 రోజులు, 2008లో 53 రోజులు, 2009లో 39 రోజులు, 2010లో 43 రోజులు, 2011లో 36 రోజులు, 2012 సంవత్సరంలో 38 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగాయని దయాకర్ రావు గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.