రాష్ట్రీయం

జైళ్ల సంస్కరణలపై 29,30న సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఈ నెల 29,30 తేదీల్లో జైళ్లలో సంస్కరణలపై ఢిల్లీలో బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు తెలంగాణ, ఆంధ్రరాష్ట్రానికి చెందిన జైళ్ల శాఖాధికారులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో జైళ్లలో అమలు చేస్తున్న సంస్కరణలను కేంద్రానికి తెలియచేసేందుకు తెలంగాణ జైళ్ల శాఖ నివేదిక రూపొందించింది. మెదక్ జిల్లా సంగారెడ్డిలో పురాతన జైలును మ్యూజియంగా మార్చడంపై దేశవ్యాప్తంగా తెలంగాణ జైళ్ల శాఖ ప్రశంసలు అందుకుంది. ఈ మ్యూజియంపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర జైళ్ల శాఖ ఐదు పెట్రోలు బంకులను నిర్వహిస్తోంది.
త్వరలో మరో ఐదు పెట్రోలు బంకులను తెరవనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో వంద పెట్రోలు బంకులను తెరిచేందుకు ఒక ప్రణాళికను జైళ్ల శాఖ ఖరారు చేసింది. దీని వల్ల సాలీనా రెండు వందల కోట్ల రెవెన్యూవస్తుంది. ప్రస్తుతం పెట్రోలు బంకులను జైళ్లలో సత్ప్రవర్తన గల ఖైదీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడున్న పెట్రోలు బంకులను విస్తరించేందుకు అనుమతిస్తే, గతంలో శిక్ష అనుభవించి విడుదలైన ఖైదీల్లో మంచి వారిని ఎంపిక చేసి వారి సేవలను వినియోగించుకునేందుకు జైళ్ల శాఖ నిర్ణయించింది.
ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదానికి పంపారు. ఉప్పల్‌లో ఇండియన్ ఆయిల్ పెట్రోలు బంకు నిర్వహణను ఇప్పటికే జైళ్ల శాఖకు అప్పగించారు. చర్లపల్లి జైలులో స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు వంద మంది ఖైదీలు ఈ యూనిట్‌లో పనిచేస్తున్నారు. దాదాపు సాలీనా 20 లక్షల రూపాయల ఆర్డర్లు ఈ సంస్థకు వస్తున్నాయి. త్వరలో మల్టీ కలర్ ఆఫ్‌సెట్ ప్రింటింగ్ ప్రెస్‌ను చర్లపల్లి జైలులో పిపిపి పద్ధతిలో నెలకొల్పనున్నారు.