రాష్ట్రీయం

వరితో జాగ్రత్త! ఇప్పుడే నారు పోయవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 24: వారంరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటం తో వరినారు పోయడానికి రైతులు ఉత్సా హం చూపిస్తున్నారని, అయితే ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ 15 కంటే ముందు వరినార్లు పోయకూడదని ప్రొఫెజర్ జయశంకర్ వ్యయసాయ వర్శిటీ శాస్తవ్రేత్త ఓ ప్రకటనలో హెచ్చరించారు. ముందుగా వరినార్లు పోస్తే చలి వల్ల దిగుబడులు సరిగా రావని ఆయన అన్నారు. అధిక వర్షాల వల్ల చీడపీడలకు అనువైన వాతావరణం ఉన్న నేపథ్యంలో సిఫారసు చేసిన మోతాదుకు మించి నత్రజని ఎరువులు వాడకూడదన్నా రు. ఎకరాలకు 35 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసి అంతర కృషి చేయాలన్నారు. గాలిలో అధిక తేమశాతం వల్ల రాబోయే రోజుల్లో సుడిదోమ, కంకినల్లి, అగ్గి తెగులు, గింజమచ్చ తెగుళ్లు ఉద్ధృతి పెరిగే అవకాశం ఉం దన్నారు. కాబ ట్టి రైతులు అప్రమత్తంగా ఉండి సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. సుడిదోమ నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాము లు లేదా బ్యూ ప్రొఫెజిన్ 1.6 మి.లీ లేదా డైనోటెప్యురాన్ 0.4 గ్రాములు లేదాపై మెట్రోజైన్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. కంకినల్లి మరియు గింజమచ్చ తెగుళ్ల నివారణకు డైకోఫాల్ 5 మి.లీ లేదా స్పైరోమెసిఫెన్ 1మి. లీకు కార్బండాజిమ్ 1గ్రాము లేదా కార్బండాజిమ్ + మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా ప్రొపికొనజోల్ 1 మిలీ లీటర్ నీటికి చొప్పున కలిపి 15రోజుల వ్యవధిలో2 సార్లు మందులను మార్చి పిచికారి చేయాలన్నారు. అగ్గి తెగులు నివారణకు ట్రైసైక్లజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రోథయెలేన్ 1.5 మి.లీ లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ లీటర్ నీటిలో కలిసి మందును 7-10రోజుల వ్యవధిలో పిచికారి చేసుకోవాలన్నారు.