రాష్ట్రీయం

యువకుల వీధిపోరు... ఇద్దరు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, డిసెంబర్ 25: గుంటూరు జిల్లా మంగళగిరిలోని నిడమర్రు రోడ్డులో గల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట రోడ్డుపై శుక్రవారం తెల్లవారుఝామున పీకలదాకా మద్యం తాగిన కొందరు యువకుల మధ్య జరిగిన స్ట్రీట్‌ఫైట్‌లో మేకతోటి హేమంత్ (25), కాకర్ల రమేష్ (20) అనే యువకులు హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం సుమారు 8 నుంచి 12 మంది యువకులు గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుఝాము వరకు మద్యం సేవిస్తుండగా మాటామాటా పెరిగి పరస్పరం దాడులకు దిగారు. తొలుత కర్రలతో దాడులు చేసుకుని ఆ తరువాత రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఒక వర్గానికి చెందిన హేమంత్, మరోవర్గానికి చెందిన రమేష్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. పట్టణ శివారులోని తెనాలి జంక్షన్ వద్ద గల ఫ్లైఓవర్‌పైకి వెళ్లి అర్ధరాత్రి వరకు మద్యం తాగి అక్కడినుంచి వాహనాలపై నిడమర్రు రోడ్డుకు చేరుకుని అక్కడ మరోమారు మద్యంతాగి తాగిన మైకంలో కొట్లాటకు దిగారు. హేమంత్ సోదరుడిని రమేష్ మనుషులు గతంలో కిడ్నాప్ చేశారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నగా మొదలైన గొడవ ఘర్షణకు దారితీసింది. హేమంత్, రమేష్ మరణించగా ఆదినారాయణ, అరుణ్‌కుమార్, మురళి, ఎవిఎస్ అనే యువకులు గాయపడ్డారు. ఘటనాస్థలంలో ఉన్న చింటు, అయ్యప్ప అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘర్షణకు కారణాలను అనే్వషిస్తున్నారు. హేమంత్, రమేష్‌ల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం అనంతరం శవాలను బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పీ గోగినేని రామాంజనేయులు, పట్టణ సిఐ బొప్పన బ్రహ్మయ్య తెలిపారు. సంఘటనా స్థలానికి డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి దర్యాప్తును ప్రారంభించగా డాగ్‌స్క్వ్యాడ్ సమీపంలోని ఒక బార్ వద్దకు వెళ్లి ఆగినట్లు పోలీసులు తెలిపారు.