రాష్ట్రీయం

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నేడు పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణ రాష్ట్రంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రిక్రూట్‌మెంట్‌కు ఎంపిక పరీక్షను ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నట్టు పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు. 251 పోస్టులకు 563 దరఖాస్తులు వచ్చాయని, వారికోసం హైదరాబాద్‌లో మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జి నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్, అదే కాలేజీలో సిఎస్‌ఇ బ్లాక్, కూకట్‌పల్లిలోని విజయసాయి టవర్స్‌లో గల ఎడ్యుసర్జ్ యూనిట్ నెంబర్ 604లోనూ ఈ ఎంపిక పరీక్ష నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. పేపర్-1 జనరల్ స్టడీస్ , జనరల్ అబిలిటీ పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకూ, పేపర్-2 వెటర్నరీ సైన్స్ మధ్యాహ్నం 2.30 నండి సాయంత్రం ఐదు గంటల వరకూ జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కార్యదర్శి సూచించారు. బయోమెట్రిక్ సమాచారం సేకరించడం జరుగుతుందని చెప్పారు.