రాష్ట్రీయం

శేషన్నకోసం వేట ముమ్మరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో కీలక వ్యక్తి శేషన్న కోసం పోలీసులు నల్లమల్లను జల్లెడ పడుతున్నారు. నరుూంకు ఆయుధాలు, డ్రగ్స్, డబ్బు సమకూర్చింది శేషనే్ననని పోలీసులు గుర్తించారు. శేషన్న మాజీ నక్సలైట్ కావడం, అతనికి నరుూంతో మంచి సంబంధాలు ఉండటం.. నరుూం డంప్‌ల రహస్యం అతనికి తెలిసి ఉంటుందనడానికి బలం చేకూరుస్తోంది. శేషన్న పీపుల్స్‌వార్‌లో ఉన్నప్పుడు అతని కార్యకలాపాలన్నింటికి నల్లమల్ల అడవులనే షెల్టర్‌గా తీసుకున్నట్టు సిట్ గుర్తించింది.
దీంతో నరుూం కేసు దర్యాప్తును సిట్ మరింత వేగవంతం చేసింది. ఈ నెలాఖరుకల్లా నరుూం ముఖ్య అనుచరులతోపాటు రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల పేర్లు బయటపెడతామని ఇటీవలే సిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నరుూం గ్యాంగ్‌లో నెంబర్-2గా కొనసాగిన శేషన్న ఆచూకీ ఇంతకాలం దొరకకపోవడంతో అతను మళ్లీ గ్యాంగ్ లీడర్‌గా కార్యకలాపాలు మొదలు పెట్టాడా? అనే కోణంలో సిట్ దర్యాప్తు జరుపుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శేషన్న ఆధిపత్యం మన్ననూరు, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్‌నగర్‌తోపాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తదితర ప్రాంతాలలో ఉండేది. కాగా ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల వరకు నరుూం తరఫున డీల్స్ చేసింది శేషనే్ననని నరుూం అనుచరులు విచారణలో వెల్లడించినట్టు సమాచారం. ముగ్గురు ప్రజాసంఘాల నేతల హత్యతోపాటు భూ కబ్జాలు, కిడ్నాప్‌లు, బెదిరింపులతో స్థలాల బలవంతపు రిజిస్ట్రేషన్లు చేయడంలో శేషనే్న కీలక పాత్ర పోషించినట్టు సిట్ గుర్తించింది.