రాష్ట్రీయం

రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంచికచర్ల, డిసెంబర్ 25: జాతీయ రహదారిపై కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం నక్కలంపేట గ్రామ సమీపంలో గురువారం అర్థరాత్రి దాటిన తరువాత ఒంటి గంట సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. సేకరించిన సమాచారం ప్రకారం జి కొండూరు మండలం గంగినేనిపాలెంకు చెందిన అన్నంశెట్టి సీతారామయ్య (30), అదే మండలం పెనుపాకకు చెందిన తలమాల వెంకట శివరాం (45), ఇబ్రహీంపట్నంకు చెందిన నక్కా విజయకుమార్ (46)లు జగ్గయ్యపేటలో వెల్డింగ్ పనులు నిర్వహిస్తూ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని గురువారం రాత్రి బైక్‌పై స్వగ్రామాలకు బయలుదేరారు. అయితే వీరు కంచికచర్ల బైపాస్‌లో ఒన్‌వేపై రాంగ్ రూట్‌లో వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఓమ్‌నీ వ్యాన్ వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అనంతపురంలో...
అమరాపురం: అనంతపురం జిల్లా అమరాపురం మండలం కెంకర గ్రామ సమీపంలో శుక్రవారం ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. చిలమత్తూరుకు చెందిన శ్రీ్ధర్ తన కుటుంబసభ్యులతో కలిసి దైవదర్శనానికి వెళ్లి తిరిగి ఆటోలో వస్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో శ్రీ్ధర్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన భార్య సౌజన్య, అత్త ఉమాదేవి, అల్లుడు శశాంక్‌ను చికిత్స నిమిత్తం హిందూపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఉమాదేవి మృతిచెందింది.
ఖమ్మం జిల్లాలో...
ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందిన సంఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని మాచినేనిపేట తండా వద్ద చోటు చేసుకుంది. పడమట నర్సాపురానికి చెందిన సాదం సాయి (13), అద్దానపు పవన్(12) క్రిస్మస్ సెలవు రోజు కావటంతో కొత్తగూడెం మండలంలోని డేగలమడుగు గ్రామంలోని బంధువుల ఇంటికి సైకిల్‌పై వెళ్ళి వస్తుండగా మాచినేనిపేట తండా వద్ద భద్రాచలం నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసి బస్సు అతివేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో సైకిల్ తొక్కుతున్న సాయి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిని పవన్‌ను కొత్తగూడెం నుంచి ఖమ్మం ఆసుపత్రికి తరలించగా మరణించాడు.
జూలూరుపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కంచికచర్ల వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి దేహాలు