రాష్ట్రీయం

అన్నీ ఇస్తానన్నారు..అందుకే ఒప్పుకున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 24: ఎటువంటి హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని, ఫలితంగా కష్టాల్లో ఉన్నా ఎలాగోలా అభివృద్ధిపథంలో నెట్టుకొస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం హోదాకు మించిన సహాయం చేస్తామని ముందుకొస్తే తెలివైనవాడిని కాబట్టే ఒప్పుకున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు రూ.30వేల కోట్లు ఇస్తామని చెప్పారని, అలాగే రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామని హామీ ఇచ్చారని, రెవిన్యూలోటును భర్తీచేస్తామని దానిలో పేర్కొన్నారన్నారు. విభజన కష్టాల పరిష్కారానికి సంబంధించి పలు అంశాలు దానిలో ఉన్నందునే హోదా కన్నా ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయంతోనే ప్యాకేజీకి అంగీకరించానని చంద్రబాబు స్పష్టం చేశారు. డబ్బులు లేకుండానే ఇప్పుడు ఎలాగోలా అభివృద్ధి కార్యక్రమాలను నడిపిస్తున్నామని, ఇక ఆనిధులు వస్తే రాష్ట్రం అంతా సంక్షేమ రాజ్యంగా మారుస్తామని భరోసా ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శనివారం స్థానిక సురేష్‌చంద్ర బహుగుణ పోలీసు ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో ఆయన ‘దోమలపై దండయాత్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా గురువారం ప్రతిపక్షనేత, వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి ఏలూరులో యువభేరి కార్యక్రమాన్ని నిర్వహించి అసందర్భంగా ప్యాకేజీ విషయంలో చంద్రబాబుపై పలువిమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన దోమలపై దండయాత్ర కార్యక్రమంలో జగన్ విమర్శలను చంద్రబాబు తిప్పికొట్టారు. విభజనతో పొట్టకొట్టారని, రెండేళ్లు గడుస్తున్నా ఏమి చేతికందక తీవ్ర ఇబ్బందుల్లో రాష్ట్రం కొట్టుమిట్లాడుతోందని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజల జీవితాల్లో వెలుగు నింపేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తూ వస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అయ్యే రూ.30వేల కోట్ల రూపాయల ఖర్చును కేంద్రం భరిస్తానంటే వద్దనమంటారా అని ప్రశ్నించారు. అలాగే రెవిన్యూలోటుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఆ లోటును భర్తీ చేస్తామని కేంద్రం ముందుకొచ్చిందని ఇలాంటి ప్రయోజనాలను తాను తెలివైనవాడిని కాబట్టే అంగీకరించానని చెప్పారు.
ఈసందర్భంగా ఆయన జగన్‌పై పరోక్ష విమర్శలు చేశారు. మొన్న ఒకాయన ఏలూరు వచ్చి నాకు ఇంగ్లీషు రాదంటూ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేస్తూనే అలాంటి వ్యక్తులు నిర్వహించే కార్యక్రమాలకు పిల్లలు వెళితే ఏం నేర్చుకుంటారో అర్ధం చేసుకోవాలని సూచించారు. కేవలం నేరాలు, ఘోరాలు, మోసాలు వంటివి నేర్చుకోవటంతోపాటు జైళ్లకు పోవటం ఎలా అన్నది కూడా వాళ్లు నేర్పిస్తారని, ఈవిషయాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఓటుకు నోటు కేసు విషయంలో కేంద్రానికి బాబు భయపడుతున్నారన్న విమర్శపై పరోక్షంగా స్పందిస్తూ ఆయన ఈవ్యాఖ్యలు చేశారు. ఎక్కడో తెలంగాణాలో ఓ కేసు నమోదైతే దానిగురించి తాను భయపడుతున్నానంటూ ప్రచారం చేసుకోవటం విడ్డూరమన్నారు. తనపై బురదజల్లేందుకు వాళ్లు 26సార్లు కోర్టుకు వెళ్లారని, అయినప్పటికీ కోర్టు సమయాన్ని ఎందుకు వృథా చేస్తారంటూ న్యాయస్ధానం చీవాట్లు పెట్టే పరిస్ధితి వచ్చిందన్నారు. తప్పు చేయనప్పుడు తనను ఎవరూ ఏమి చేయలేరని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధితోపాటు అనందం కూడా అవసరమేనన్న అభిప్రాయంతో పలు కార్యక్రమాలను అమలుచేస్తున్నామన్నారు. దేశ అభివృద్ధి సగటు కన్నా రాష్ట్భ్రావృద్ధి అధికంగా ఉందని, గత ఆర్ధిక సంవత్సరంలో 15.8శాతం వృద్ధిరేటు సాధించామని, పెట్టుబడుల విషయంలోనూ 10.99శాతం పెరుగుదల కన్పించిందన్నారు. రానున్న 20ఏళ్లలో దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబడుతుందన్నారు.

చిత్రం.. ఏలూరులో మొక్కలు నాటుతున్న ఏపి సిఎం చంద్రబాబు