రాష్ట్రీయం

డిసెంబర్ 5నుంచి నీట్ పిజి ప్రవేశపరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: దేశవ్యాప్తంగా మెడికల్ , డెంటల్ పిజి కాలేజీల్లో ఉన్న ఎండి, ఎంఎస్, పిజి డిప్లొమా సీట్ల భర్తీకి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్) పీజీ -2017ను డిసెంబర్ 5 నుండి నిర్వహించాలని నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్ణయించింది. ఈ ప్రకటన ఆదివారం వెలువడనుంది. పిజి పరీక్ష డిసెంబర్ 5 నుండి 13వ తేదీ వరకూ జరుగుతుంది. డెంటల్ కోర్సులకు మాత్రం నవంబర్ 30న పరీక్ష జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 41 పట్టణాల్లో 86 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు కూడా ఈ పరీక్షకు హాజరు కావలసిందే.300 బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఈ పరీక్ష ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. డెంటల్ కోర్సుల అడ్మిషన్లకు మాత్రం ప్రవేశపరీక్ష 240 మార్కులకు ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు ఎన్‌బిఇ డాట్ ఎడ్యు డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నట్టు చెప్పారు. అనుమానాలుంటే వాటిని నివృత్తి చేసేందుకు ఒక ఈ-మెయిల్, టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా బోర్డు ఏర్పాటు చేసింది. అయితే ఈ ఎంట్రన్స్‌లో ఎయిమ్స్ జిప్‌మర్, పిజిఐంఇఆర్, నిమ్‌హాన్స్, శ్రీచిత్ర సంస్థలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. వచ్చే ఏడాది నీట్ యుజి సీట్లు కూడా దాదాపు 10వేల వరకూ పెరగనున్నాయని కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 58 వైద్య సంస్థల స్థాయిని కాలేజీ స్థాయికి పెంచనుంది.