రాష్ట్రీయం

రాజమహేంద్రవరంలోనే తెలుగు వర్శిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 24: రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. ఈ మేరకు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం కార్యాలయాన్ని కృష్ణాజిల్లా కూచిపూడిలో ఏర్పాటు చేస్తూ హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్ ఆఫీసర్ ఈ మేరకు అక్కడ కార్యాలయాన్ని ప్రారంభించారు. దీనిపై లోక్‌నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ తీవ్రంగా స్పందించి మంత్రిని విశాఖలోని ప్రభుత్వ అతిథి గృహంలో శనివారం కలిశారు. మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో మంత్రి స్పందించి ఆ స్పెషల్ ఆఫీసర్‌కు, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి రాజమహేంద్రవరంలోనే తెలుగు విశ్వవిద్యాలయం కార్యాలయం పని చేయాలని ఆదేశించారు. ఈ విషయాన్ని మీడియాకు మంత్రి వివరించారు. అనంతరం మీడియాతో యార్లగడ్డ మాట్లాడుతూ గతంలో సిఎం ఇచ్చిన హామీని పక్కన పెట్టి కూచిపూడిలో కార్యాలయం ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఇటీవలే తెలుగు విశ్వవిద్యాలయం 19 కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను జారీ చేసిందన్నారు. ఇందులో నాలుగు కోర్సులను కూచిపూడి, శ్రీశైలం, రాజమహేంద్రవరంలో నిర్వహిస్తారని, మిగిలిన 15 కోర్సులు వరంగల్, హైదరాబాద్‌లో ఉంటాయన్నారు. దీని వల్ల రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఈ 15 కోర్సుల్లో ప్రవేశాలు ఈ ఏడాది పొందే అవకాశం లేదన్నారు. రాజమహేంద్రవరంలో కార్యాలయం ఏర్పాటు చేయడం విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తొలి అడుగని అభివర్ణించారు. పూర్తి స్థాయి విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యే సమయానికి విద్యార్థులు సిద్ధంగా ఉంటారన్నారు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఇన్‌చార్జి విసి నియామకానికి సంబంధించి కూడా న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారన్నారు. దీంతో త్వరలోనే విసి నియామకం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు స్పందిస్తున్నంత చురుగ్గా అధికారులు స్పందించడం లేదని, ఈ విషయంలో మంత్రి చొరవ తీసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో తెలుగు భాషాభిమానులు పి.వెంకటరావు, తెలుగు విశ్వవిద్యాలయం రీసెర్చి స్కాలర్లు తదితరులు ఉన్నారు.