రాష్ట్రీయం

తిరుమలలో పెరిగిన రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, డిసెంబర్ 25 : తిరుమల క్షేత్రం శుక్రవారం భక్తకోటితో నిండిపోయింది. క్రిస్మస్, న్యూ ఇయర్ వరుస సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా భారీగా యాత్రికులు తరలివచ్చారు. గురువారం 67,358 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కాగా శుక్రవారం తిరుమల వైకంఠం క్యూకాంప్లెక్స్ 1,2లోని కంపార్ట్‌మెంట్లన్ని పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో స్వామి వారి దర్శనానికి సుమారు మూడు కిలోమీటర్ల పొడవునా రోడ్డుపై క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుండగా కాలినడకన భక్తులకు కల్పించే దివ్యదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు సుమారు 35 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా అర్థరాత్రి సమయానికి మరో 20 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వేలాదిగా తిరుమలకు తరలివచ్చిన భక్తులకు టిటిడి తగిన ఏర్పాట్లు చేసింది.
క్యూలైన్లలో వేచివున్న భక్తులకు నిత్యం అన్నపానీయాలు అందజేస్తోంది. రద్దీ అధికంగా ఉండడంతో టిటిడి సిఫార్సు ఉత్తరాలకు కల్పించే దర్శనాలను కుదించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ వారికి ఎక్కువ సమయం కేటాయించి దర్శనం కల్పిస్తున్నారు. ఇక గదులు దొరకని భక్తులు రోడ్డుపైనే నిద్రిస్తున్నారు. దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టిటిడి ఏర్పాటు చేసిన లగేజి, సెల్‌పోన్ డిపాజిట్ల కౌంటర్ల వద్ద భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడ డిపాజిట్ చేసే భక్తులు గంటల కొద్దీ లైన్లలో వేచి వుండి తమ లగేజీని, సెల్‌ఫోన్లను భద్రపరచుకొంటున్నారు. దీంతో దర్శనానికి వెళ్లేందుకు సమయం దాటిపోతుండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక టిటిడి అధికారులు నిత్యం క్యూలైన్లను తనిఖీ చేస్తూ భక్తుల అవసరాలకు తగ్గట్టుగా అన్నపానీయ సరఫరా, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

వరుస సెలవులు రావడంతో కిటకిటలాడుతున్న తిరుమల కొండలు