రాష్ట్రీయం

భారత్‌లో అశాంతిని ప్రేరేపిస్తున్న పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: మన దేశ భూభాగంలో పాకిస్తాన్ అశాంతిని ప్రేరేపిస్తున్నదని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందా స్ అతవాలే మండిపడ్డారు. పాకిస్తాన్‌పై ఎటువంటి చర్యలకైనా వెనుకాడబోమని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారని ఆయన ఆదివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో గుర్తు చేశారు. జమ్మూకాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడాని కి పాక్ ప్రయత్నిస్తున్నదని ఆయన విమర్శించారు. తాము యుద్ధాన్ని కోరుకోవ డం లేదని, శాంతిని కోరుకుంటున్నామని అన్నారు. అయితే పాక్ అశాంతిని ప్రేరేపిస్తున్నదని దుయ్యబట్టారు. ఇటీవల ఉరీ సైనిక శిబిరంపై పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిని మంత్రి తీవ్రంగా ఖండించారు.
కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి
దేశంలో కుల వ్యవస్థను నిర్మూలించాలంటే కులాంతర వివాహాలను ప్రోత్సహించాల్సి ఉందని రాందాస్ అతవాలే అన్నారు. దళితుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని ఆయన తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకునే వారికి ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 77 శాతం మంది ఉన్న ఎస్‌సి, ఎస్‌టి, ఇతర వెనుకబడిన వర్గాల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రిజర్వేషన్ల కోసం ఇతర వర్గాలు, కులాల నుంచి వస్తున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని వారికి కూడా రిజర్వేషన్ కల్పించాలని ఆయన సూచించారు.
తెలంగాణ పథకాలు బాగున్నాయి
తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు బాగున్నాయని అభినందించారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా బడుగు, బలహీనవర్గాల వారికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రీ-మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పలు స్కాలర్‌షిప్‌లను అందజేస్తోందని ఆయన చెప్పారు.