రాష్ట్రీయం

ఆంధ్ర, తెలంగాణ మధ్య జల విద్యుత్ జగడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం సమిసిపోకముందే జల విద్యుత్‌పై రగడ ప్రారంభమైంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి చేస్తున్న జల విద్యుత్‌లో ఆంధ్రాకు వాటా ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ పంపింది. తెలంగాణ నుంచి తమకు విభజన చట్టంలో నిర్దేశించిన దాని ప్రకారం 1512 మెగావాట్ల జల విద్యుత్‌ను తెలంగాణ ఇవ్వాల్సి ఉంటుందని ఏపి కేంద్ర హోంశాఖకు లేఖలో పేర్కొంది. ఈ ప్రాజెక్టులను కృష్ణా బోర్డు తన ఆధీనంలోకి తెచ్చుకుని తమకు న్యాయం చేయాల్సిందిగా కోరింది. జల విద్యుత్‌లో ఆంధ్రాకు 46.11శాతం కేటాయించాలని విభజన చట్టంలో ఉందని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణకు 53.89 శాతం వాటాను కేటాయించారు. తెలంగాణలో మొత్తం జల విద్యుత్ ఉత్పాదన 3280 మెగావాట్లు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రాకు 1512 మెగావాట్లు రావాలని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణకు 1762 మెగావాట్ల విద్యుత్ దక్కుతుంది. తెలంగాణ, ఆంధ్రలో జల విద్యుత్ ఉత్పాదన మొత్తం 3280 మెగావాట్లు. విభజన తర్వాత ఆంధ్రాకు 910 మెగావాట్ల ప్రాజెక్టు, తెలంగాణకు 2370 మెగావాట్ల ప్రాజెక్టులు వెళ్లాయి. నీటి కేటాయింపుల తరహాలోనే నీటి ఆధారంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను కేటాయించాలని ఏపి వాదిస్తోంది.
ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఉన్న 374 టిఎంసి నీటిలో ఆంధ్రా వాటా 264 టిఎంసి ఉంది. ఈ వాటా ప్రకారమే ఉత్పత్తి అయిన జల విద్యుత్ కావాలని ఏపి కేంద్రాన్ని కోరింది. పులిచింతల ప్రాజెక్టు సాగునీటి జలాలను ఆంధ్ర పూర్తిగా వినియోగించుకుంటోంది. అలాగే పులిచింతలపై నిర్మించిన జల విద్యుత్ మాత్రం తెలంగాణ ఆధీనంలో ఉంది. ఈ ప్రాజెక్టులో కూడా తమకు వాటా ఉందని, రాయల్టీ చెల్లించాల్సి ఉంటుందని ఏపి పేర్కొంది. పులిచింతల కుడివైపు తాముకూడా కొత్తగా జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తామని ఏపి కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.