రాష్ట్రీయం

గీతమ్‌లో అమెరికా వర్శిటీల ఫెయిర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: గీతమ్ యూనివర్శిటీ హైదరాబాద్ క్యాంపస్‌లో 28వ తేదీన అమెరికా యూనివర్శిటీల ఫెయిర్ నిర్వహించనున్నట్టు యూనివర్శిటీ ప్లేస్‌మెంట్స్ డైరెక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్ తెలిపారు. 28వ తేదీన ఉదయం 9 నుండి 11.30 గంటల వరకూ అమెరికాకు చెందిన 29 విశ్వవిద్యాలయాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని విద్యార్ధుల సందేహాలను నివృత్తి చేస్తారని ఆయన వివరించారు. అమెరికాలో పలు విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్న కోర్సులు, విద్యార్హతలు, ఫీజుల వివరాలు, భారతీయ విద్యార్థులకు ఉన్న ప్రయోజనాలు వంటి వివరాలు ఆయా వర్శిటీల ప్రతినిధులు వివరిస్తారని అన్నారు. వర్జీనియా ఏవియేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెయింటెనెన్స్, పెరోయాలోని బ్రాడ్‌లీ వర్శిటీ, కాలిఫోర్నియాలోని స్టేట్ యూనివర్శిటీ, సియాటెల్ సిటీ యూనివర్శిటీ, ఆరిజోనా ఫ్లోరిడాలోని ఎంబ్రే రిడ్లీ, లాంగ్‌వుడ్ వర్శిటీ, మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, యూనివర్శిటీ ఆఫ్ నార్తరన్ లోవా, న్యూయార్క్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్ తదితర వర్శిటీలు పాల్గొంటాయని అన్నారు.
జెఎన్‌టియుహెచ్‌లో ఐడియేషన్ సెంటర్ ప్రారంభిస్తున్నట్టు వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. పూర్వవిద్యార్థుల భాగస్వామ్యంతో నిర్వహించనున్నామన్నారు.