రాష్ట్రీయం

ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: గోదావరి, కృష్ణా బేసిన్‌లో వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఈ రెండు బేసిన్‌లలో ఉన్న అన్ని ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులన్నీ నీటితో నిండుకుండల్లా మారటంతో గేట్లు తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో వీటిని చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు ప్రాజెక్టులను వస్తున్నారు. చాలాకాలం తరువాత నిండిన నిజాంసాగర్ ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరిగింది. కర్నాటక లోని కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడం వల్ల తెలంగాణలో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు కూడా నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టుల గేట్లు కూడా ఎత్తివేశారు. తెలంగాణలోని ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు నీటితో నిండిపోవడంతో మంత్రులు, ప్రజాప్రతినిధులు గంగమ్మ పూజ చేస్తున్నారు. నిండుకుండలా నిండిన ఎల్‌ఎండి ప్రాజెక్టు గంగమ్మ పూజ చేసి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆరుగేట్లను తెరిపించారు. నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఇతర మంత్రులు తమ తమ జిల్లాల్లో గంగమ్మ తల్లికి పూజలు చేశారు. గ్రామాల్లో చెరువులు నిండిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు చెరువులకు పూజలు చేస్తున్నారు.
కృష్ణా బేసిన్ కన్నా గోదావరి బేసిన్‌లో వరద ఉధృతి ఎక్కువగా ఉంది.
* నిజాం సాగర్ ప్రాజెక్టు సామర్థ్యం 1405 అడుగులు 17.80 టిఎంసిలు. కాగా ప్రస్తుతం 1401. అడుగులు 12 .47టిఎంసిలతో నిండుకుండలా ఉంది. వరద నీటిని దృష్టిలో పెట్టుకుని 99వేల క్యూసెక్‌ల నీటిని విడుదల చేస్తున్నారు.
* ఎస్‌ఆర్‌ఎస్‌పి సామర్థ్యం 1091అడుగులు. 90.31 టిఎంసిలు. ప్రస్తుతం 1089.20 అడుగులు, 90.13 టిఎంసిల నీరు ఉంది. ఇన్‌ఫ్లో246800 క్యూసెక్‌లు, ఔట్‌ప్లో 20,2000 క్యూసెక్‌లు.
* ఎల్లంపల్లి సామర్థ్యం 485.56 అడుగులు. 20.18 టిఎంసిలు. ప్రస్తుతం 481.16అడుగులు. 20.18 టిఎంసిల నీరు ఉంది. ఇన్‌ఫ్లో 338229 క్యూసెక్‌లు, ఔట్ ఫ్లో 257604 క్యూసెక్‌లు.
* కడెం ప్రాజెక్టు సామర్థ్యం 700 అడుగులు. 698.08 అడుగులు. 7.60 టిఎంసిలు. ఇన్‌ఫ్లో 4039 క్యూసెక్‌లు. ఔట్ ఫ్లో545క్యూసెక్‌లు.
* ఎల్‌ఎండి ప్రాజెక్టు సామర్థ్యం 920 అడుగులు. 24.07 టిఎంసిలు. ప్రస్తుతం 1715915.65 అడుగులు. 24.07 టిఎంసిలు. ఇన్‌ఫ్లో 40145 క్యూసెక్‌లు, ఔట్ ఫ్లో 14000 క్యూసెక్‌లు.
* సింగూర్ ప్రాజెక్టు సామర్థ్యం 1717.93 అడుగులు. ప్రస్తుతం 1716.78 అడుగులు. పూర్తి సామర్థ్యం 29.91 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 28.14 టిఎంసిలు నీరు చేరింది. ఇన్‌ఫ్లో 85300 క్యూసెక్‌లు, ఔట్ ఫ్లో 73500 క్యూసెక్‌లు.
కర్నాటకలో వర్షాలు కృష్ణా బేసిన్‌లో వరద
* కృష్ణా బేసిన్‌లో జూరాల సామర్థ్యం 9.66 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 1043.92 అడుగుల నీరు చేరింది. ప్రస్తుత నీటి నిల్వ 8.97 టిఎంసిలు. ఇన్‌ఫ్లో 145000 క్యూసెక్‌లు, ఔట్ ఫ్లో 142479 క్యూసెక్‌లు.
* శ్రీశైలం డ్యామ్‌లో సామర్థ్యం 885.01 అడుగులు. 215.78 టిఎంసిలు. ప్రస్తుతం 885.01 అడుగులు. 191.65 టిఎంసిల నీరు ఉంది. ఇన్‌ఫ్లో 140214 క్యూసెక్‌లు. ఔట్ ఫ్లో 77399 క్యూసెక్‌లు.
* నాగార్జునసాగర్ డ్యామ్ 590 అడుగులు. 312.05 టిఎంసిలు. ప్రస్తుతం 518.20 అడుగులు. 312.05 టిఎంసిల నీరు చేరింది. ఇన్‌ఫ్లో 73868 క్యూసెక్‌లు, ఔట్ ఫ్లో 1350 క్యూసెక్‌లు.
* మూసీ సామర్థ్యం 645 అడుగులు 4.46 టిఎంసిలు. ప్రస్తుతం 643.85 అడుగులు. 4.22 టిఎంసిల నీరు ఉంది. ఇన్‌ఫ్లో 6680 క్యూసెక్‌లు, ఔట్ ఫ్లో 5000 క్యూసెక్‌లు.
* పులిచింతల ప్రాజెక్టు సామర్థ్యం 175 అడుగులు. 45.77 టిఎంసిలు. ప్రస్తుతం 175 అడుగులు. 30 టిఎంసిల నీరు చేరింది. ఇన్‌ఫ్లో 5000 క్యూసెక్‌లు. ఔట్ ఫ్లో 5000 క్యూసెక్‌లు. నీటి ప్రవాహం నిలకడగా ఉండడంతో సాయంత్రం నుంచి పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల నిలిపివేశారు.

చిత్రాలు..నిజాంసాగర్ ప్రాజెక్టునుంచి నీరు విడుదల చేసిన దృశ్యం
లోయర్ మానేరు గేట్లు ఎత్తివేయడంతో ఎగిసి పడుతున్న నీరు