క్రీడాభూమి

మారుతున్న అమరావతి డిజైన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇంత వరకూ సిద్ధం చేసిన డిజైన్లలో మార్పులకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్కిటెక్చర్‌తో కూడిన కొత్త డిజైన్లను మరోమారు స్వీకరించి అవసరమైన చేర్పులు మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఒక పక్క పనులను వేగవంతం చేయడం, మరో వైపు భూములు ఇచ్చిన రైతులకు సిఆర్‌డిఎ ప్లాట్లను పంపిణీ చేయడంతో పాటు పూర్తి వివరాలతో కూడిన భూమి హక్కు పత్రాలను కూడా అందిస్తోంది. మొత్తం రాజధాని నగరం 53,478 ఎకరాల విస్తీర్ణంలో ఉంది, ల్యాండ్ పూలింగ్ ద్వారా 37,505 ఎకరాలు తీసుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా, రైతులు స్వచ్ఛందంగా 34,984 ఎకరాలు ఇచ్చారు. అందులో 4292 ఎకరాలు గ్రామ కంఠాలు ఉన్నాయి. నివాస వాణిజ్య ప్రాంతం మొత్తం కలిపి 14404.7 ఎకరాలు తిరిగి రైతులకు ఇచ్చేస్తున్నారు. 217 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో రాజధానిని నిర్మిస్తారు. అందులో 9 నగరాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. వౌలిక సదుపాయాలక కల్పనకు 2537 ఎకరాలను వినియోగిస్తారు. 45 ఎకరాల్లో ఇప్పటికే తాత్కాలిక సచివాలయం నిర్మించారు. 900 ఎకరాల్లో వివిధ శాఖల ప్రభుత్వ భవనాలు నిర్మిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నగరాన్ని అందంగా నిర్మించడానికి 41,235 కోట్లు అవసరమవుతాయి. రాజధానికి అధికార యంత్రాంగం కుటుంబాలతో సహా తరలివచ్చే వారు ప్రాధమికంగా 35 లక్షల 40వేల మంది జనాభా ఉంటారు. కృష్ణా నదికి ఇరువైపులా 15 నుండి 30 కిలోమీటర్ల మేర సుందరంగా తీర్చిదిద్దుతారు. నగరం మొత్తం విస్తీర్ణంలో 29.5 శాతం ప్రాంతాన్ని బ్లూ గ్రీన్ గా అభివృద్ధి చేస్తారు. 1998 ఎకరాలను పారిశ్రామిక అవసరాలకు వాడతారు. 7710 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం వాణిజ్య కార్యకలాపాలకు కేటాయిస్తారు. అమరావతి మహానగరంలో పరిపాలనా నగరం, ఆర్ధిక నగరం, న్యాయ నగరం, విద్యా నగరం, పర్యాటక నగరం, మీడియా నగరం, ఎలక్ట్రానిక్ నగరం, విజ్ఞాన నగరం, క్రీడల నగరాలను నిర్మిస్తారు.
అంతర్జాతీయ నగరాలకు ధీటుగా ప్రధాన రోడ్లను 50 మీటర్లు, 60 మీటర్ల వెడల్పున 316 కిలోమీటర్లు వేస్తారు. 134 కిలోమీటర్లు పొడవున మెట్రో రైలు మార్గం నిర్మిస్తారు. అమరావతికి 25 కిలోమీటర్లు దూరంలోని గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ వినాశ్రయంగా తీర్చిదిద్దుతారు. 80 కిలోమీటర్లు దూరంలో సీ పోర్టును భవిష్యత్ అవసరాలకు తీర్చిదిద్దుతారు.