రాష్ట్రీయం

ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 30: ఛత్తీస్‌గడ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుగుణంగా ఛత్తీస్‌గడ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో ఉత్తర కోస్తాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గడచిన 24 గంటల్లో ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షపాతాలు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఇచ్ఛాపురంలో 6 సెంమీ, గంట్యాడ 5 సెంమీ, పలాస 4 సెంమీ వర్షపాతం నమోదైంది.