రాష్ట్రీయం

ఏపి ట్రిబ్యునల్ తీర్పులు అమలు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 30: తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు కావడానికి ముందున్న ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సెప్టెంబర్ 15 వరకు ఇచ్చిన తీర్పులను తు.చ తప్పకుండా అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు తెలియజేసింది. ఏపి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఉమ్మడి హైకోర్టుకు బదలాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఏపిఏటి పరిధి నుంచి తెలంగాణను తొలగిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలుచేస్తూ పివి.కృష్ణయ్య, బి.కిరణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ దుర్గ ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే మాదిరిగా గతంలో ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులను హైకోర్టుకు బదలాయించిన అంశాన్ని తెలంగాణ అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణరెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆర్డినెన్స్ జారీని సవాల్ చేయవచ్చని పిటిషనర్లకు ధర్మాసనం సూచిస్తూ కేసును వాయిదా వేసింది.