రాష్ట్రీయం

నేడు సేవ్ టెంపుల్స్ డాక్యుమెంటరీ చిత్రోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 30: గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ (జిహెచ్‌హెచ్‌ఎఫ్), సేవ్ టెంపుల్స్ ఆర్గ్ (యుఎస్‌ఎ) సంయుక్తంగా శనివారం ‘సేవ్ టెంపుల్స్ డాక్యుమెంటరీ’ చలన చిత్రోత్సవాన్ని నిర్వహించనున్నాయి. బంజారాహిల్స్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రచార సారథి డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. సాయంత్రం 7 గంటలకు జరిగే బహుమతి ప్రదానోత్సవంలో శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ, ఎపిఇఆర్‌సి చైర్మన్ జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్ రావు, ఆంధ్రప్రదేశ్ మాజీ డిజిపి అరవింద రావు తదితరులు పాల్గొంటారని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చిత్రోత్సవంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘కురుమూర్తి రాయ’, ‘మహేంద్ర గిరి’, ‘మనుషులు చేసిన దేవుడు’ తదితర డాక్యుమెంటరీలను ప్రదర్శించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ డాక్యుమెంటరీ చిత్రోత్సవాలకు జ్యూరీ మెంబర్స్‌గా చలన చిత్ర దర్శకుడు ‘లక్ష్మణ రేఖ’ గోపాలకృష్ణ, సినీ, రంగస్థల నట శిక్షకుడు దీక్షిత్ డి.ఎస్, సినీ గేయ రచయిత సిరాశ్రీ వ్యవహరిస్తారని గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు.