జాతీయ వార్తలు

మా తీర్పుకు లోబడే అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణాలు తమ తుది తీర్పుకు లోబడి ఉండాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై శ్రీమన్నారాయణ, మాజీ ఐఎఎస్ ఈఏఏస్ శర్మ, బొలిశెట్టి సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై ట్రిబ్యునల్ శుక్రవారం విచారణ జరిపింది. ఎన్జీటి చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ ముందు ఏపీ తరపున్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం రెండు లంక గ్రామాల్లో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారని పేర్కొన్నారు. కాగా పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది సంజయ్ పారీఖ్ వాదిస్తూ రాజధాని ప్రాంతంలో వేగంగా రోడ్ల నిర్మాణం చేపడుతున్నారని, ఆ ప్రాంతంలో ప్రవహించే కొండవీటి వాగు ప్రవాహగతిని మారుస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలపై అన్ని వివరాలతో వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ తరపున్యాయవాదికి సూచించింది. అలాగే మరో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్మాణాలలో పదేపదే పర్యావరణ అనుమతుల ఉల్లంఘన జరుగుతున్నందున ఏన్జీటి పర్యవేక్షణలో స్వతంత్ర నిపుణుల కమిటీ వేయాలని సంజయ్ పారిఖ్ విజ్ఞప్తి చేశారు. అయితే రాజధాని ప్రాంతంలో నిర్మాణాలన్నీ ఏన్జీటి తుది తీర్పునకు లోబడి ఉండాలని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబరు 31 తేదీకి వాయిదా వేసింది.