రాష్ట్రీయం

క్రైస్తవులకు అండగా ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట), డిసెంబర్ 25: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ఉదయం గుణదల మేరిమాత పుణ్యక్షేత్రం సందర్శించి, పుణ్యక్షేత్రం ప్రధాన దేవాలయంలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామమోహన్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, గృహనిర్మాణ సంస్ధ ఛైర్మన్ వర్ల రామయ్య తదితరులు కూడా చర్చిలో ప్రార్ధనలు జరిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుణ్యక్షేత్రంకు చేరుకోగానే విజయవాడ కతోలిక పీఠం మోన్‌సిజ్ఞోర్, పుణ్యక్షేత్రం రెక్టర్ యం.చిన్నప్ప, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ మువ్వల ప్రసాద్ తదితర గురువులు స్వాగతం పలికి పుణ్యక్షేత్రంలోనికి తోడ్కొని వెళ్ళారు. రెక్టర్ చిన్నప్ప ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్రిస్మస్ శుభాకాంక్షలు అందజేశారు. ప్రధాన చర్చిలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్రైస్తవులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా వుంటుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ దేశాలలో జరుపుకునే పండుగ క్రిస్మస్ పర్వదినమని తెలిపారు. క్రీస్తు ప్రేమకు, శాంతికి, కరుణకు ప్రతి రూపమని, ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుదామని పేర్కొన్నారు. భవానీపురంలోని క్రైస్తవుల సమాధుల ప్రాంగణం సమస్య తన దృష్టికి వచ్చిందని, ఆ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించటానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం చంద్రబాబు క్రైస్తవులకు చంద్రన్న క్రిస్మస్ కానుకను పంపిణీ చేశారు. చంద్రబాబుకు గుణదలమాత పుణ్యక్షేత్రం రెక్టర్ యం.చిన్నప్ప గుణదల మేరిమాత మెమొంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రైస్తవ పెద్దలు పాల్గొన్నారు.

గుణదల మేరిమాత పుణ్యక్షేత్రంలో
క్రిస్మస్ కేక్ కట్ చేస్తున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు