రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 1: తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో ఆదివారం ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. ఈ మేరకు ఐఎండి శాస్తవ్రేత్త శంభురవీందర్ పేరుతో ఒక బులెటిన్ విడుదలైంది. తెలంగాణ, విదర్భ, చత్తీస్‌గఢ్ మధ్యలో ఉపరితలద్రోణి కొనసాగుతోందని, సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఇది కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. ఇలా ఉండగా నైరుతీరుతుపవనాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా ఉన్నాయని వివరించారు. గత 24 గంటల్లో నిజామాబాద్ జిల్లా జుక్కల్‌లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నిజామాబాద్, మెదక్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్ల్లో భారీగా వర్షపాతం నమోదైంది. ఎపిలోని విజయనగరం, గుంటూరు, శ్రీకాకుళం, కృష్ణా, విశాఖపట్నం తదితర జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి.