రాష్ట్రీయం

బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, అక్టోబర్ 3: శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి నాందిగా శ్రీవారి ఆలయంలో సోమవారం ధ్వజారోహణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 6.15 నుంచి 6.30 గంటల మధ్య మీనలగ్నంలో వైఖానస ఆగమ సంప్రదాయ రీత్యా పవిత్ర గరుడ పతాకాన్ని (్ధ్వజపటం) బంగారు ధ్వజస్తంభ శిఖరాగ్రంపై ఆవిష్కరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉత్సవమూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవి సమక్షంలో సీతారామాచార్యులు క్రతువు నిర్వహించి, మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల మధ్య పతాక ఆవిష్కరణ చేశారు. ధ్వజస్తంభంపై ఎగిరే గరుడ పతాకమే బ్రహ్మోత్సవాల కోసం ముక్కోటి దేవతలకు ఆహ్వానపత్రం. ఈ ఆహ్వానాన్ని అందుకొని సకల దేవతలు 9 రోజుల పాటు సప్తగిరులలో ఉంటూ ఉత్సవాలను తిలకిస్తారని పురాణాలలోప్రతీతి. ధ్వజారోహణానికి శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి, పరివార దేవతలైన అనంతుడు (ఆదిశేషుడు), గరుత్మంతుడు, విష్వక్సేనుడు, గరుడ ధ్వజం, సుదర్శన చక్రతళ్వారుతో కలిసి ఆలయ పురవీధులలో ఊరేగారు.ఈక్రమంలో ధ్వజస్తంభంపై ఉన్న గరుడాళ్వారులకు పొంగలిని నైవేద్యంగా పెట్టారు. ఈ పొంగలి స్వీకరిస్తే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని, సర్పదోషం పోతుందని, ప్రసాదం మనిషిలోని రుగ్మతలను దూరం చేస్తుందని భక్తుల నమ్మకం. ధ్వజారోహణ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి దంపతులు, ఇఓ సాంబశివరావు దంపతులు, తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు, అనంతపురం డిఐజి ప్రభాకర్‌రావు, టిటిడి సివిఎస్‌ఓ శ్రీనివాస్, ఎస్పీ జయలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు, టిటిడి బోర్డు సభ్యులు, ఆలయ డిప్యూటీ ఇఓ కోదండరామారావు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

చిత్రం.. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి నాందిగా ధ్వజారోహణం నిర్వహిస్తున్న దృశ్యం