రాష్ట్రీయం

చిన్నారికి బ్రెయన్ డెడ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: ఇటీవల పంజగుట్ట వద్ద జరిగిన చిన్నారి రమ్య ప్రమాద ఘటన మరువకముందే మరోసారి అలాంటి ప్రమాదమే సోమవారం ఔటర్ రింగ్‌రోడ్డుపై చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట వద్ద కారు అదుపుతప్పి తల్లీ కూతుళ్లను ఢీకొట్టింది. ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి బ్రెయిన్ డెడ్ అయ్యింది. లాలాపేటకు చెందిన శ్రీదేవి, ఆమె కూతురు సంజన (5) ఆదివారం రాత్రి పెద్దఅంబర్‌పేటలో శుభకార్యానికి హాజరై తిరిగి వెళ్తున్నారు. రాత్రి పదిన్నర గంటల సమయంలో పెద్దఅంబర్‌పేట సమీపంలో రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ వైపు వేగంగా వస్తున్న కారు వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరిని హయత్‌నగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం చిన్నారి సంజనను కామినేని ఆసుపత్రికి తరలించారు. కారులో ముగ్గురు యువకులు మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నీళ్ల సీసాల్లో మద్యం ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటన అనంతరం యువకులు కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. కారును స్వాధీనం చేసుకున్న హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కారు ప్రమాదంలో గాయపడిన చిన్నారి సంజన పరిస్థితి విషమంగా ఉందని కామినేని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసాదరావు తెలిపారు. ప్రమాదంలో పాప ఎడమ కాలు, ఎడమ చేయి విరిగాయని, శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది పడుతోందన్నారు. ప్రస్తుతానికి కృత్రిమ శ్వాస అందిస్తున్నామని, మరో 24 గంటలు గడిస్తే కాని ఆరోగ్య పరిస్థితిపై అంచనాకు రాలేమన్నారు. ఆసుపత్రికి చేరుకున్న చిన్నారి సంజన బంధువులు పాప ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు. పాప బ్రెయిన్ డెడ్ అయ్యిందని కన్నీటిపర్యంతమయ్యారు. తల్లి శ్రీదేవి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
లొంగిపోయిన కారు డ్రైవర్
హయత్‌నగర్ సమీపంలోని పెద్ద అంబర్‌పేటలో ఆదివారం రాత్రి తల్లి కూతుళ్లను ఢీకొట్టి పారిపోయిన నిందితులు సోమవారం వనస్థలిపురం ఏసిపి ఎదుట లొంగిపోయారు. కారు డ్రైవర్ వెంకట్‌తోపాటు మరో ఇద్దరు యువకులు కారులో ఉన్నట్టు వెంకట్ తెలిపారు. మహేష్, వినేష్‌ల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

చిత్రం.. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంజన