రాష్ట్రీయం

కృష్ణా జలాలపై కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: కృష్ణా జలాల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ఇరు రాష్ట్రాల అధికారులతో కృష్ణా యాజమాన్య బోర్డు ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణంపై వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ఇటీవల కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి నేతృత్వంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు కృష్ణా జలాల వినియోగంపై పర్యవేక్షణకు ఇరు రాష్ట్రాల అధికారులతో జాయింట్ కమిటీ ఏర్పాటైంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో మలయాల పంపింగ్ స్టేషన్ వద్ద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పి నరేంద్ర (తెలంగాణ), ఎం హరిప్రసాద్ (ఆంధ్ర) ఉంటారు. పోతిరెడ్డిపాడు బనకచర్ల కాంప్లెక్స్ వద్ద ప్రాజెక్టును డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎంవిఆర్ శర్మ (తెలంగాణ), ఆంధ్ర నుంచి బివి రమేష్ బాపూజీ, ఎన్ విష్ణువర్థన్‌రెడ్డి, డి చైతన్య పర్యవేక్షిస్తారు. శ్రీశైలం డ్యామ్ వద్ద తెలంగాణ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బిసి ధరణికుమార్ ఉంటారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు తెలంగాణ నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి శంకర్ ఉంటారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కుడి కాలువ వద్ద తెలంగాణ నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం సతీష్ కుమార్, ఎడమ కాలువ వద్ద సంపత్, ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టు వద్ద మహేశ్వర్‌రెడ్డి, నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద కె విజయకుమార్ ఉంటారు.
ఆంధ్ర నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎ కేశవరావు, జిఎస్‌ఎస్ సత్యనారాయణ ఉంటారు. నీటి విడుదల, ఆయా రాష్ట్రాలు నీటిని వినియోగించుకోవడం పై ఈ రెండు రాష్ట్రాల అధికారులు పర్యవేక్షిస్తారు.