రాష్ట్రీయం

ముగిసిన అతిరుద్ర మహాయజ్ఞం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, డిసెంబర్ 25: తూర్పు గోదావరి జిల్లా దాక్షారామలో గత ఆరు రోజులుగా నిర్వహించిన అతిరుద్ర మహాయజ్ఞం శుక్రవారం ముగిసింది. శుక్రవారం సాయంత్రం పూర్ణాహుతితో మహాయజ్ఞం ముగిసింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెంచలకోన (పెనుశిల క్షేత్రం) శ్రీమణిద్వీప మహాసంస్థానం భగవతి శ్రీశ్రీశ్రీ విజయేశ్వరిదేవి కరుణామయి అమ్మ నేతృత్వంలో, రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సహకారంతో ఈ మహాక్రతువు నిర్వహించారు. శుక్రవారం ఉదయం గురువందనం, వేద పారాయణం, గురుప్రార్ధన, మహన్యాసం కార్యక్రమాలు జరిగాయి. అనంతరం రుద్రాభిషేకం, రుద్రహోమం, వసోర్ధార, ఉత్తరంగా దశధర, షోడసాధనం, ప్రాయిశ్చిత్తహోమం కార్యక్రమాలు వేదోక్తంగా జరిగాయి. అనంతరం అతిరుద్ర మహాయజ్ఞ మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని మాతా శ్రీశ్రీశ్రీవిజయేశ్వరిదేవి నిర్వహించారు. భక్తులు విశేషసంఖ్యలో పాల్గొన్నారు.

చిత్రం.. అతిరుద్రం మహాయజ్ఞం ముగింపు సందర్భంగా మహాపూర్ణాహుతి ఇస్తున్న దృశ్యం