తెలంగాణ

పోలీసుల అదుపులో టిఆర్‌ఎస్ నేత చింతల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: గ్యాంగ్‌స్టర్ నరుూం ముఖ్య అనుచరుల్లో ఒకరైన నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన టిఆర్‌ఎస్ నేత చింతల వెంకటేశ్వరరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నరుూం ఎన్‌కౌంటర్ తరువాత వెంకటేశ్వర్‌రెడ్డి కర్ణాటకలో ఎక్కువ సమయం గడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ భాగ్ అంబర్‌పేట లోని వైభవ్ నగర్‌లో నివాసముంటున్న ఆయన కొంతకాలం నుంచి బెంగుళూరులో ఉంటున్నట్టు తెలిసింది. సమాచారం అందిన చింతల వెంకటేశ్వరరెడ్డిని సిట్ అధికారులు బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నరుూంతో ఆర్థిక లావాదేవీలు, భూ దందాలు జరిపాడని చింతలపై ఆరోపణలు రావడంతో సిట్ విచారణ జరిపింది. ఆయన నుంచి నరుూంకు సంబంధించి కీలక సమాచారాన్ని సిట్ రాబట్టింది. చింతల భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. తరువాత టిఆర్‌ఎస్‌లో చేరారు. మరోవైపు నరుూం కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు అరెస్టయిన వారిలో నరుూం అనుచరుల పేర్లను వెల్లడించిన సిట్ నేడో, రేపో నరుూంకు సహకరించిన పోలీస్ అధికారులు, రాజకీయ నాయకుల పేర్ల జాబితాను వెల్లడించనున్నట్టు తెలిసింది. నరుూం వ్యవహారంలో ఇప్పటి వరకు 155 కేసులు నమోదు కాగా, 95 మందిని అరెస్టు చేశారు. 8మంది లొంగిపోయారు. ఇంకా 95 మందికి పిటీ వారెంట్లు జారీ చేసినట్టు సిట్ అధికారులు తెలిపారు.
ఫరీదుద్దీన్
నామినేషన్ ఆమోదం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 4:శాసన మండలి ఉప ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన మంగళవారం పూర్తయింది. టిఆర్‌ఎస్ తరఫున ఫరీదుద్దీన్ దాఖలు చేసిన నామినేషన్ సక్రమంగానే ఉందని ఆమోదించారు. ఒక స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో ఒకే ఒక నామినేషన్ దాఖలైంది.