తెలంగాణ

భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న వరద గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, అక్టోబర్ 4: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ పెరుగుతోంది. వారం రోజుల వ్యవధిలో మూడోసారి గోదావరికి వరదలు రావడంతో తీరప్రాంత ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను విడుదల చేయడంతో భద్రాచలం వద్ద మంగళవారం సాయంత్రం నాటికి 37 అడుగులకు వరద నీటిమట్టం పెరిగింది. అయితే 40 అడుగుల వరకు వచ్చి గోదావరి ఉద్ధృతి తగ్గుతోందని అధికారులు పేర్కొనడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. గోదావరికి వరద పెరుగుతున్న నేపథ్యంలో తీరప్రాంత మండలాల అధికారులు, సెక్టోరియల్ అధికారులను భద్రాచలం ఇంఛార్జ్ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు అప్రమత్తం చేశారు.