రాష్ట్రీయం

కాశీ అన్నపూర్ణగా కరుణించిన దుర్గమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 4: అన్నం పరబ్రహ్మ స్వరూపం.. సర్వ జీవనాధారం అటువంటి అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణాదేవిని నిత్యాన్నదేవిని నిత్యాన్న దానేశ్వరిగా నిటలాక్ష ప్రాణేశ్వరిగా కొలుస్తాం.. సర్వమానవాళే కాకుండా జీవకోటి నశించి పోకుండా అన్నపూర్ణాదేవి నిజ నివాసం కాశీపురం.. అధినాధుడు విశే్వశ్వరుడి ప్రియపత్ని అన్నపూర్ణాదేవిని కాశీఅన్నపూర్ణ అని పిలుస్తాం.. దుర్గమ్మ దివ్య స్వరూపాల్లో అన్నపూర్ణాదేవి ఒకరు. సాక్షాత్తు తన భర్త పరమేశ్వరుడే ఆదిబిక్షవుగా వస్తే ఆ తల్లి అన్నపూర్ణగా బిక్ష ప్రసాదించిన చరిత్ర ఉంది. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో నాలుగోరోజైన ఆశ్వీయుజ శుద్ధ తదియ మంగళవారం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ అన్నార్తుల ఆకలి తీర్చే అన్నపూర్ణగా భక్తకోటికి దర్శనమిచ్చింది. తెల్లవారుఝామునే మూలవిరాట్టు కాశీపురాధీశ్వరిగా ఆలయ అర్చకులు అలంకరించారు. ఇక అప్పటికే వేలాదిమంది భక్తులు క్యూ మార్గాల్లో బారులు దీరారు. మరోవైపు ఉత్సవ దేవతామూర్తికి లక్ష కుంకుమార్చనలు, వేద మంత్రాల ఘోష పర్వతరాజంపై ప్రతిధ్వనించింది. ఇంద్రకీల గిరులు నిత్యం ఓం కనకదుర్గాయైనమః అనే నామ స్మరణతో పులకించిపోతున్నాయి.
ఇదిలా వుండగా అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి డి.బాలాజీ ఎప్పటిలా సాంప్రదాయబద్ధంగా అర్చకులతో కలసివచ్చి మేల్‌ఛాట్ పట్టువస్త్రాలను దుర్గగుడి ఆలయ ఇవో సూర్యకుమారికి అందజేశారు. ఇక నేడు శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ తదితరులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఐదో రోజైన బుధవారం దుర్గమ్మ శ్రీ కాత్యాయనిదేవి అలంకారంతో భక్తకోటికి దర్శనమివ్వనుంది.

chitram...
కాశీ అన్నపూర్ణాదేవిగా భక్తులను కరుణిస్తున్న దుర్గమ్మ