తెలంగాణ

ఎయిర్‌ఫోర్స్ వింగ్ అధికారి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: డ్రగ్స్ కేసులో మరో నిందితుడిగా ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ రాజశేఖర్‌రెడ్డిని ఎన్‌సిబి బుధవారం అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ డ్రగ్స్ ముఠాకు సహకరిస్తున్నాడన్న అభియోగాలపై నాందేడ్ వెళ్తుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం డ్రగ్స్ తయారు చేస్తున్నారన్న అభియోగంపై బెంగుళూరు సైంటిస్టు వెంకటరమణ, అతని భార్య సహా రవిశంకర్‌రావును ఎన్‌సిబి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. డయేరియాకు మందు పేరుతో ఈ ముఠా డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో మొత్తం 231 కిలోల నిషేధిత యాంఫెటమైన్ మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 250 కోట్లు ఉంటుందని అంచనా. డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎయిర్‌ఫోర్స్ వింగ్ అధికారి రాజశేఖర్‌రెడ్డి గురించి సంచలన నిజాలు బయటకు వచ్చాయి. చిన్ననాటి స్నేహితుడైన సైంటిస్టు వెంకటరామారావుతో కలసి రెండేళ్లుగా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం. 14 ఏళ్ల క్రితం రాజశేఖర్‌రెడ్డి వైమానిక దళంలో చేరారు. బెంగుళూరు, చెన్నై నుంచి విదేశాలకు ఎంఫటామైన్ మాత్రల ఎగుమతి చేసేవారని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో పొడి రూపంలో ఎంఫటామైన్ తయారు చేసి బెంగుళూరులోని ఓ ప్లాంట్‌లో మాత్రల రూపంలోకి మార్చేవారని, పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.250 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్టు అధికారులు తెలిపారు. కాగా బుధవారం అరెస్టయిన ఎయిర్‌ఫోర్స్ విభాగం అధికారి రాజశేఖర్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. గురువారం బెంగుళూరులోని ఓ ఫ్యాక్టరీలో సోదా జరిపి పూర్తి డ్రగ్స్ వివరాలను వెల్లడించే అవకాశం ఉందంటున్నారరు. ఇదిలావుండగా డ్రగ్స్ ముఠాలో ఇప్పటి వరకు నలుగురు అరెస్టు కాగా, ఇంకెంత మంది ఉన్నారనే దిశగా అధికారులు ఆరా తీస్తున్నారు.