రాష్ట్రీయం

అప్పుల్లో ఏపి సమాచార శాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: ‘ఆశ లావు.. పీక సన్నం’ అంటే ఇదే. ప్రచారంలో పక్క రాష్ట్రంతో పోటీ పడాలి. కానీ సొమ్ములు ఇచ్చేది మాత్రం అంతంతమాత్రమే. సరిపడా సిబ్బంది, అధికారులు, వసతులు లేక ఏపి సమాచార శాఖ సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది. ఫలితంగా దాదాపు 50 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. సర్కారు సకాలంలో నిధులివ్వకపోవడంతో బకాయిలు చెల్లించలేక నానా అవస్థలు పడుతుతున్న పరిస్థితి నెలకొంది.
నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు జనంలోకి వెళ్లడం లేదన్న విమర్శలున్నాయి. ఇటీవల మంత్రి పుల్లారావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఎన్ని మంచిపనులు చేస్తున్నా తగినంత ప్రచారం దక్కడం లేదని వాపోయారు. మంత్రివర్గ సమావేశాలు, దాని తర్వాత జరిగే పార్టీ సమన్వయ కమిటీ సమావేశాలు, పార్టీ వేదికలపై కూడా దాదాపు ఇలాంటి ఆవేదనే వ్యక్తమవుతోంది.
మీడియాలో తగినంత ప్రచారం రావడం లేదని, పక్కనే ఉన్న తెలంగాణలో మీడియా అంతా ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని, చివరకు ఏపిలో తమ పార్టీకి అనుకూలంగా ఉండే రెండు పత్రికలు, చానెళ్లు కూడా, తెలంగాణలో తెరాస ప్రభుత్వానికి, పార్టీకి విపరీతమైన ప్రచారం ఇస్తున్నాయన్న వ్యాఖ్యలు తరచూ వినిపిస్తున్నాయి.
రాష్ట్ర విభజనకు ముందు చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు వినిపించేవి కాదు. ఎందుకంటే అప్పట్లో బాబు ప్రచారానికి అధిక బడ్జెట్ కేటాయించేవారు. విభజన తర్వాత పరిస్థితి మారి, కేవలం కొన్నింటికే పరిమితం చేయడంతో ప్రచారం కూడా పరిమితమయింది. బడ్జెట్ కూడా అతి తక్కువగా ఉండటంతో భారం సమాచారశాఖపై పడుతోంది. కార్యక్రమాలు పెరిగి, ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ అంతా బిజీ కావడంతో ఆ శాఖపై భారం కూడా అంతే పెరిగింది. భారం-ఒత్తిడికి సరిపడినంత సిబ్బంది, అధికారులు లేకపోవడంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. సమాచారశాఖపై అవగాహన ఉన్న ఐఏఎస్ అధికారులు లేకపోవడం కూడా సమస్యకు ప్రధాన కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ శాఖలో నలుగురే అడిషనల్ డైరక్టర్లు ఉన్నారు. ఒక్కో శాఖకు ఒక్కో పీఆర్‌ఓ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ సరిపడా సిబ్బంది లేకపోవడంతో జర్నలిస్టులను ఔట్‌సోర్సింగ్‌లో నియమించుకుంటున్నారు. వారికి సైతం క్రమం తప్పకుండా జీతాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
దీనికితోడు పెరిగిన అప్పుల భారం మరో సమస్యగా పరిణమించింది. సమాచారశాఖ 50 కోట్ల అప్పుల్లో ఉన్నట్లు సమాచారం. గతేడాది జరిగిన గోదావరి పుష్కరాలకు సంబంధించి 16 కోట్లు, జనరల్ బడ్జెట్ నుంచి రావలసిన మరో 24 కోట్లు, అంతకుముందు బకాయిలు మొత్తం కలిపి సుమారు 50 కోట్లు ఉన్నట్లు సమాచారం. నిజానికి ఇది దాదాపు 100 కోట్లు ఉండగా, మునుపటి కమిషనర్ కృష్ణమోహన్ దానిని తగ్గించడంతో ఈ సంఖ్యకు చేరింది. కాగా గతంలో అన్ని శాఖలకు సమాచార శాఖ నుంచే ప్రకటనలు విడుదలయ్యేవి. దానితో సీఎంలతోపాటు, ఆ స్కీములకు అధిక ప్రచారం లభించేది. కానీ ఇప్పుడు ఏ శాఖకు సంబంధించి ఆ శాఖ ప్రకటనలు ఇచ్చుకోవడంతో సమాచారశాఖ పాత్ర పరిమితమయింది.
కానీ ప్రచారం తగ్గినప్పుడు, వ్యతిరేక కథనాలు వచ్చినప్పుడు, ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి ఆశించినంత ప్రచారం రానప్పుడు మాత్రం ప్రతి మంత్రి సమాచారశాఖ అధికారులనే వివరణ అడుగుతున్న పరిస్థితి ఏర్పడింది. మునుపటి మాదిరిగా అన్ని శాఖల ప్రచార బడ్జెట్ సమాచారశాఖకు కేటాయించి సింగిల్‌విండో విధానం తీసుకువస్తే తప్ప, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం లేదు.
తెలంగాణ ప్రభుత్వం ప్రచారానికి సుమారు 357 కోట్లు ఖర్చు పెడుతుంటే ఏపి ప్రభుత్వ బడ్జెట్ మాత్రం 40 కోట్లు కూడా దాటడం లేదు. మంత్రులు తమ శాఖలో జరిగే పనులను చూపించేందుకు మీడియాను తీసుకువెళ్లే సందర్భంలో ఆ ఖర్చులను కూడా సమాచారశాఖపై రుద్దుతున్నారు. గతంలో దూరదర్శన్‌లో ప్రజలతో ముఖాముఖి ద్వారా సీఎంను ప్రజలకు చేరువ చేసిన ఢిల్లీ అధికారిని కమిషనర్‌గా తీసుకువచ్చినా, ఆయన పాత్ర కూడా పెద్దగా ఏమీలేనట్లు కనిపిస్తోంది. తెలంగాణలో సర్కారుకు ఎక్కువ ప్రచారం రావడానికి, ఏపిలో తక్కువ ప్రచారం దక్కడానికీ ఇదే కారణమని అధికారులు విశే్లషిస్తున్నారు. వీటిని విన్న సీనియర్లు సమాచారశాఖను సంస్కరించాలని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. దానికితోడు సమాచారశాఖలో నియమితులైన సలహాదారులు, ప్రభుత్వం నియమించిన ఢిల్లీ పీఆర్‌ఓ (ఓఎస్డీ), వివిధ శాఖల్లో నియమితులైన పీఆర్‌ఓలు, ఎంఎల్‌ఓలు ఎవరికి జవాబుదారీనో కూడా తెలియని గందరగోళం నెలకొంది.