రాష్ట్రీయం

తెలంగాణలో ప్రైవేటు వర్శిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: తెలంగాణలో ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే వేర్వేరు ప్రాంతాల్లో అనుమతి పొంది ప్రైవేటు యూనివర్శిటీలు నిర్వహిస్తున్న సంస్థలతో పాటు మరో 50 ఇంజనీరింగ్ కాలేజీలు కూడా యూనివర్శిటీల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రైవేటు యూనివర్శిటీల బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బిల్లుకు ఇప్పటికే ఒక రూపాన్ని ఇచ్చిన ప్రభుత్వం, దానికి తుది మెరుగులు దిద్దుతోంది. అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన విశ్వవిద్యాలయాలు సైతం తమ క్యాంపస్‌లను హైదరాబాద్, సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.
గీతం, ఇక్ఫాయి, కెఎల్ యూనివర్శిటీ, విజ్ఞాన్ వంటి సంస్థలు ఇప్పటికే డీమ్డ్ వర్శిటీలను నిర్వహిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ సంస్థలు కూడా ప్రైవేటు వర్శిటీలను ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నాయి. ఒకే సబ్జెక్టును తీసుకుని స్పెషాలిటీ వర్శిటీలను కూడా ఏర్పాటు చేసేందుకు ఈ బిల్లుతో వీలు కలుగుతుందని చెబుతున్నారు. యుఎస్, ఆస్ట్రేలియా, యుకె , కెనడా తదితర దేశాల్లో ఉన్నట్టు ఫిజిక్స్ యూనివర్శిటీ, ఇంజనీరింగ్ యూనివర్శిటీ, కెమిస్ట్రీ యూనివర్శిటీ, మేనేజిమెంట్ యూనివర్శిటీల తరహాలో ఇక్కడ కూడా వర్శిటీలను ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ఇప్పటికే చాలా దరఖాస్తులు ఉన్నత విద్యాశాఖ వద్ద, మరికొన్ని ఉన్నత విద్యామండలి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని ప్రైవేటు కాలేజీలకు ఇప్పటికే అటానమస్ హోదాను కల్పించిన ప్రభుత్వం వాటిని సైతం యూనివర్శిటీలుగా తీర్చిదిద్దేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది. కొత్తగా రాబోయే వర్శిటీలను ఎక్కడ నెలకొల్పాలి, అందుకు ప్రభుత్వ పరంగా చేయాల్సినది ఏమైనా ఉందా...యూనివర్శిటీల ఏర్పాటుకు భూమిని సమకూర్చినట్టయితే ఏం చేయాలి తదితర అంశాలపై కూడా ప్రభుత్వం ఇప్పటికే విస్తృతంగా చర్చించి ముసాయిదాను రూపొందించింది. ఈ ముసాయిదా నివేదికను త్వరలో ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెడుతుంది. దానిని ఆమోదించడంతో ప్రైవేటు వర్శిటీల బిల్లు అమలులోకి వస్తుంది.