రాష్ట్రీయం

నేడు వైభవంగా శ్రీవారి గరుడసేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, అక్టోబర్ 6: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీవారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనం అధిరోహించి భక్తులను కనువిందు చేయనున్నారు. శుక్రవారం రాత్రి జరిగే వాహన సేవను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో టిటిడి, జిల్లాపోలీసులు ప్రతిష్ఠ భద్రత, పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని టిటిడి భక్తుల సౌకర్యాలు, రవాణా, భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుపతి, తిరుమల మధ్య 3800 ట్రిప్పులు తిప్పడానికి ఆర్టీసీ చర్యలు తీసుకుంది. ప్రతి 20 సెకన్లకు ఒక బస్సు అందుబాటులో ఉండే విధంగా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. తిరుమలకు చేరుకున్న భక్తులను మధ్యాహ్నం నుంచే గ్యాలరీలోకి అనుమతిస్తామని, ఆ తర్వాత గ్యాలరీలలో ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా అందిస్తామని టిటిడి తెలిపింది. ఇప్పటికే అలిపిరి నుంచి తిరుమల వరకు రోడ్డు భద్రతకు పోలీస్‌శాఖ చర్యలు తీసుకుంటున్నది. అత్యవసర పరిస్థితులలో భక్తులకు ఏవైనా ఇబ్బందులు తలెత్తినపుడు ప్రథమచికిత్స అందించేందుకు మెడికల్ కేంద్రాలను, 10 అంబులెన్సులను సిద్ధం చేశారు. వాహన సేవ జరిగే సమయంలో భక్తులు చిల్లరనాణేలను విసరవద్దని టిటిడి విజ్ఞప్తి చేసింది. దీని వలన ఉత్సవ మూర్తులకు నష్టం వాటిల్లుతుందని, కానుకలు ఇవ్వదలచిన వారు వాహన సేవ ముందు భాగాన నడిచే మొబైల్ హుండీలలో వేయాలని టిటిడి కోరింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాడవీధులలో బారికేడ్లను ఇప్పటికే ఏర్పాటుచేశారు. వివిఐపి, విఐపి, పోలీస్, ప్రెస్, టిటిడి సిబ్బందికి ప్రత్యేకంగా గ్యాలరీలను కూడా ఏర్పాటుచేసింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచే గరుడ సేవకు భక్తులను గ్యాలరీల్లోకి అనుమతిస్తామని టిటిడి అధికారులు చెప్పారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక టీమ్‌లను పోలీస్ శాఖ ఏర్పాటుచేసింది. అంతేకాకుండా తిరుమలలోని ప్రధాన కూడళ్లు, మాడవీధులు, పరిసర ప్రాంతాలలో ఏర్పాటుచేసిన సిసి కెమెరాల ద్వారా అనునిత్యం పరిశీలిస్తూ ఎవరైనా అనుమానితులు తిరుగుతుంటే గుర్తించి వివరాలు సేకరించడానికి సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూము ఏర్పాటు చేసి నిరంతరాయంగా గస్తీకాస్తున్నారు. నేడు గరుడ సేవ సందర్భంగా అర్ధ రాత్రి నుంచి రెండు ఘాట్‌రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి రద్దుచేసింది. తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో నాలుగువేల ద్విచక్ర వాహనాలు నిలపడం కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటుచేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తిరుపతిలో ఏర్పాటుచేసిన పార్కింగ్ స్థలాలలో తమ ద్విచక్ర వాహనాలను పార్క్ చేయాలని టిటిడి, పోలీస్ యంత్రాంగం విజ్ఞప్తి చేశాయి.
తిరుమలలో 663 సిసి కెమెరాలతో నిఘా
శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తిరుమల అంతటా 663 సిసి కెమెరాలను ఏర్పాటుచేశామని, వాహన సేవలు ఊరేగింపుజరిగే 4 మాడ వీధుల్లోనే 163 కెమెరాలను ఏర్పాటుచేసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు టిటిడి ఇన్‌చార్జి సివిఎస్‌ఓ, చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ విలేఖరులకు తెలిపారు.