రాష్ట్రీయం

తీరు మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 6: పార్టీకి చెందిన మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల అందరి పనితీరును తాను మొదటి నుంచి మదింపుచేస్తూ వస్తున్నానని.. ప్రజలతో ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నదీ ప్రభుత్వ కార్యక్రమాలను ఏ విధంగా అమలు చేస్తున్నదీ అన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉన్నాననీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. గుంటూరు జిల్లా కెఎల్ యూనివర్సిటీలో మూడురోజులపాటు జరిగిన తెలుగుదేశం పార్టీ శిక్షణా తరగతులు గురువారం రాత్రి ముగిశాయి. విశాఖపట్నం పర్యటన ముగించుకుని సాయంత్రం హాజరైన సిఎం రాత్రి 8.30 ప్రాంతంలో కీలకోపన్యాసం చేసారు. ముందుగా ఆయా సభ్యుల పనితీరును మదింపు చేసిన నివేదికను వారికి అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆయా కవర్లలో అందజేసిన సమాచారం ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటకి పొక్కరాదంటూ హెచ్చరిక చేశారు. పలు కోణాల్లో, పలు సర్వేల ద్వారా సేకరించిన సమాచారాన్ని పూర్తిగా ఆ సీల్డ్ కవర్లలో అందించామన్నారు. అందులో అంశాలన్నింటినీ ఆకళింపు చేసుకుని తమ ప్రవర్తన మార్చుకునేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఎలాంటి మార్పు కనిపించని పక్షంలో వచ్చే ఎన్నికల్లో సీట్లు కూడా రావని హెచ్చరించారు. మున్ముందు పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండగలదని కూడా స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచన కూడా ఉందన్నారు. నాయకుల పిల్లలకు ఎన్టీఆర్ స్కూల్‌లో సీట్లు ఇవ్వటమే కాకుండా వారికి పోటీ పరీక్షల్లోను, ఇతర వృత్తి నైపుణ్యంలోను ఉచిత శిక్షణ అందించటం జరుగుతుందన్నారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లో పార్టీని మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో ఏ స్థాయిలోను విభేదాలను సహించబోనని స్పష్టం చేశారు. ఇకనుంచి ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తానన్నారు. నవంబరు మాసంలో జరిగే జనచైతన్య యాత్రల్లో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. డ్వాక్రా రుణమాఫీ కింద మరో నెల రోజుల్లో ఒక్కొక్కరికి రూ.3వేలు చొప్పున చెల్లించటం జరుగుతుందన్నారు.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఉదయం నుంచి సభ్యులతో మమేకమై ట్యాబ్, యాప్‌లను ఎలా వినియోగించుకోవాలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలకు కొంతకాలంగా తాను దూరంగా ఉంటూ వస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. తన ఆరోగ్యం సహకరించనందునే విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోందన్నారు. అధికార ప్రతినిధులు, పార్టీ నాయకులు టివి ఛానల్స్‌లో జరిగే చర్చల్లో పాల్గొంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. కార్యకర్తలను పట్టించుకోని నాయకులను పార్టీ కూడా పట్టించుకోబోదని వారికి ఎలాంటి పదవులు కూడా రాబోవని స్పష్టం చేశారు.

శిక్షణా తరగతుల్లో మాట్లాడుతున్న చంద్రబాబు