రాష్ట్రీయం

సాంకేతిక పరిజ్ఞానం ప్రగతికి సాధనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 6: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, వాటిని సాంకేతిక పరిజ్ఞానంతో అధిగమిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘డిజిటల్ డిస్ట్రప్షన్ అండ్ ఇన్నోవేషన్, నేవిగేటింగ్ ది నెక్స్ట్‌జన్ రివల్యూషన్’ అంశంపై గురువారం విశాఖలో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ పాలనను సాంకేతికతతో అనుసంధానం చేశామని చెప్పారు. అన్ని శాఖల్లో డిజిటలైజేషన్‌ను అమలు చేస్తున్నామన్నారు. ఈ-క్యాబినెట్, బిగ్ డేటా ఎనాలసిస్, డ్రోన్, సిసి కెమెరా, బయోమెట్రిక్‌తో పాలనను మరింత సరళతరం చేశామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 50 మున్సిపాలిటీల్లో వీధి దీపాల స్థితిగతులను కమాండ్ కంట్రోల్ రూం నుంచి తెలుసుకుంటున్నామని ఆయన చెప్పారు. కృష్ణా పుష్కరాల్లో సాంకేతికతను విరివిగా ఉపయోగించుకోవడంతో 95 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన తెలియచేశారు. సాంకేతికతను ఎక్కువగా వినియోగించుకోవడం ద్వారా డబుల్ డిజిట్ గ్రోత్‌ను సాధించగలిగామన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారిగా కాంగ్రెస్సేతర పార్టీ అత్యుత్తమ మెజార్టీతో కేంద్రంలో పగ్గాలు చేపట్టిందని, దీనికి మోదీ సమర్థతే కారణమని చంద్రబాబు అన్నారు. మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు భారత ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరుస్తున్నాయని సిఎం అన్నారు. చైనాలో 1978లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారని, భారత దేశంలో 1995లో సంస్కరణలు మొదలయ్యాయని చెప్పారు. అయితే చైనా మనకన్నా 13 ఏళ్లు ముందు ఉందని ఆయన చెప్పారు. భారతదేశానికి యువత ఇప్పుడు కీలకం కాబోతున్నారని చంద్రబాబు చెప్పారు.
భారతీయుల ఐక్యు ఎక్కువని, నాలుగవ పారిశ్రామిక విప్లవానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని ఆయన చెప్పారు. టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను కలిపి ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని, అందుకు సమర్థవంతమైన నాయకత్వం ఉండాలని ఆయన చెప్పారు. దీనివలన పేదరికాన్ని నిర్మూలించడానికి అవకాశం ఉంటుందని చంద్రబాబు చెప్పారు.