ఆంధ్రప్రదేశ్‌

ఇద్దరు కుమార్తెలకు విషమిచ్చిన తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం/ కొయ్యలగూడెం, అక్టోబర్ 7: కుటుంబ కలహాలతో ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి, తాను కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన తండ్రి ఉదంతమిది. తండ్రి, రెండేళ్ల కుమార్తె మృతిచెందగా, ఏడు నెలల పసికందైన మరో కుమార్తె మృత్యువుతో పోరాడుతోంది. ద్వారకాతిరుమల మండలం దోరసానిపాడుకు చెందిన లక్కాబత్తుల లూథిరాజుకు, కొయ్యలగూడెం మండలం రామానుజపురానికి చెందిన స్వాతికి మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె కన్యకు రెండేళ్లుకాగా, మరో కుమార్తె ఏడు నెలల పసికందు. రెండో కుమార్తె పుట్టినప్పటి నుండి ఆడ పిల్లలను కన్నావంటూ భర్త నుండి స్వాతికి వేధింపులు మొదలయ్యాయి. రెండు బిడ్డకు అయిదో నెల వచ్చాక తల్లిదండ్రులు సారెతో స్వాతిని భర్తవద్దకు పంపారు. అయితే భర్త వేధింపులు తట్టుకోలేక రెండు నెలలకే పిల్లలతో పుట్టింటికి వచ్చేసిందని ఆమె తండ్రి ఏసు తెలిపాడు. మూడు రోజుల క్రితం అత్తింటికి వచ్చిన లూథిరాజు భార్య, పిల్లలను తీసుకెళతానని చెప్పాడు. అయితే భార్యను వేధించనని పెద్ద మనుషుల్లో చెప్పాక పంపిస్తామని అత్తింటివారు చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత చిన్న కుమార్తె అమృతతో స్వాతి ఇంటి బయట పడుకుంది. లూథిరాజు మాత్రం పెద్ద కుమార్తె కన్యతో గదిలో పడుకున్నాడు. ఈలోగా చిన్న పిల్ల ఏడుస్తుంటే లూథిరాజు వచ్చి లోనికి తీసుకు వెళ్లాడు. లోనికి వెళ్ళిన కొద్దిసేపటికే ఏడుపు ఆగిపోవడంతో అనుమానించన స్వాతి లోనికివెళ్ళి చూడగా అప్పటికే మొదటి కుమార్తె కన్య నోటివెంట నురగలు కక్కుకుంటుండగా, లూథిరాజు కూడా కుప్పకూలి పోయాడు. అతని చేతిలోని అమృత ఆపస్మారక స్థితికి వెళ్ళిపోయింది. ఇద్దరు చిన్నారులను మోటార్ సైకిల్‌పై, లూథిరాజును ఆటోలో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కన్య, లూథిరాజు మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. అమృత కొన ఊపిరితో ఉండటంతో జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పిల్లలకు విషం ఇచ్చి, అతను కూడా మింగివేసినట్టు నిర్థారణకు వచ్చామని పోలీసులు చెప్పారు. సంఘటనా స్థలాన్ని కొయ్యలగూడెం ఎస్సై పి.చెన్నారావు పరిశీలించారు. కేసు దర్యాప్తుచేస్తున్నారు.